ఆంధ్రప్రదేశ్‌

‘అనంత’లో పండ్ల తోటలను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: అనంతపురం జిల్లాలో ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు సత్వర చర్యలు చేపట్టాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో పలు పండ్ల తోటలను పరిశీలించిన రామకృష్ణ ఫోన్ ద్వారా మంత్రి సోమిరెడ్డికి తోటలకు నీరందక ఎండిపోతున్న తీరుని వివరంగా వివరించారు. వేసవి తీవ్రత వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బావులు, బోర్లలో కూడా నీరు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. దీని పై మంత్రి సోమిరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ పండ్ల తోటలను కాపాడుకోటానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం ద్వారా 80 శాతం సబ్సిడీతో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.