ఆంధ్రప్రదేశ్‌

ఆఖరి ఓటు లెక్కింపు వరకూ అప్రమత్తంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కించే వరకు వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని పార్టీ సీనియర్ నేతలు సూచించారు. స్థానిక ఓ ఫంక్షన్ హాలులో గురువారం కౌంటింగ్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సామ్యూల్‌లు హాజరై పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల చీఫ్ ఎజెంట్లు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమం అనంతరం కార్యక్రమ ముఖ్యాంశాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయిపోయి ఈ నెల 23వ తేదీన కౌంటింగ్ జరగబోతున్నదున ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం కౌంటింగ్ ఏజెంట్ల అర్హతలు, విధులు, బాధ్యతలు, వారు నిర్వర్తించాల్సిన అంశాలు వివరించామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించే వారిపై క్రిమినల్ కేసులు ఉండకూడదన్నారు. ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగానే కౌంటింగ్ ఏజెంట్లను నియమించాలన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారందరూ ఆయా నియోజకవర్గాలకు వెళ్లి స్థానికంగా ఉన్న ఏజెంట్లకు శిక్షణ ఇస్తారు. ఇదే విషయాలపై వారికి అవగాహన కల్పిస్తారని అన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి 18మందిని, ఎంపీ కౌంటింగ్‌కు సంబంధించి 18 మందిని ఏజెంట్లుగా పెట్టుకునే అవకాశం ఉందన్నారు. వీవీ ప్యాట్‌లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్లను లాటరీ ద్వారా ఎంపిక చేసి లెక్కించమని సుప్రీం కోర్టు సూచించిందన్నారు.