ఆంధ్రప్రదేశ్‌

ఈసీ తీరు ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు ఈసీ చిత్తశుద్ధినే సందేహాస్పదం చేస్తున్నాయని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేతలు, అమిత్ షా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తక్షణం స్పందిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను విస్మరించడం ఆందోళనకరమని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలని 22 పార్టీలు ఉమ్మడిగా విజ్ఞప్తి చేసినా, ఎన్నికల సంఘం ఏ మాత్రం పట్టించుకోకపోవడం మరీ దారుణమని విమర్శించారు. మోదీకి పదే పదే ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడం , బీజేపీ చేసిన తప్పుడు ఫిర్యాదులపై కూడా వెంటనే స్పందించి తక్షణం చర్యలు తీసుకోవడం, అదే ప్రతిపక్షాల ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నప్పటికీ, కావాలనే ఫిర్యాదులపై చర్యలు చేపట్టకపోవడం వంటివి ఈసీ నిస్పాక్షికతపై స్పష్టమైన అనుమానాలు రేకెత్తిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షం చేసిన ఫిర్యాదులపై కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈసీకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాల వినియోగంపై విశ్వసనీయత నిరూపించుకోవాలని డిమండ్ చేశారు.