ఆంధ్రప్రదేశ్‌

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. రీకౌంటింగ్ నిర్ణయాన్ని ఆయా నియోజకవర్గాల ఆర్వోలే తీసుకుంటారని స్పష్టం చేశారు. చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల పీవో, ఏపీవోలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు తదితర అంశాలపై వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫలితాల లెక్కింపులో వీవీప్యాట్‌లోని స్లిప్‌లు ఫారం 17సీతో సరిపోవాలన్నారు. కంట్రోల్ యూనిట్‌లో మరమ్మతులు సాధ్యం కాకాపోతే వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తామన్నారు. ఈవీఎంల లెక్కింపు పూర్తి అయిన తరువాతే సాంకేతికంగా ఇబ్బందులు ఎదురైన ఈవీఎంల వీవీప్యాట్‌ల స్లిప్‌ల లెక్కింపు చేపడతామన్నారు. కౌంటింగ్‌కు ముందు మాక్‌పోల్ రిపోర్టు లెక్కలు కూడా సరిపోవాలన్నారు. సీఆర్సీ చేయకుండా పోలింగ్ కొనసాగిస్తే, పీవో డైరీ ఆధారంగా ఆ ఓట్లను తొలగిస్తామన్నారు. వీవీప్యాట్ స్లిప్‌లు, ఈవీఎం ఓట్లతో సరిపోవాలని, రెండింటి లెక్కల్లో తేడా వస్తే, రెండోసారి లెక్కిస్తామన్నారు. లెక్కింపు సమయంలో సందేహాలు తలెత్తితే పోలింగ్ డైరీల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. సాంకేతిక సమస్యలు, వివాదాలు తలెత్తిన చోట ఈసీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
మొరాయించిన ఈవీఎంల లెక్కింపు కౌంటింగ్ చివర్లో చేపడతామని, ఓట్ల లెక్కింపులో పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమన్నారు. ర్యాండమైజేషన్‌ను సీఆర్పీ చేయని ఈవీఎంలకు మినహాయింపు ఇస్తున్నామన్నారు. రీకౌంటింగ్ నిర్ణయాధికారం ఆర్వోలదేనని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ సమయంలో సర్వీస్ ఓట్లా పోస్టల్ బ్యాలెట్లా, మొత్తం ఓట్లా అన్న విషయాన్ని ఆర్వో, పరిశీలకులు కలిసి నిర్ణయిస్తారన్నారు. లెక్కింపు రాష్ట్రంలో అన్ని చోట్ల ఒకేసారి ప్రారంభం అవుతుందన్నారు. 15 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తాయన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి పీవో, ఏపీవోలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అనధికార వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
బాబు సూచనలకు ఓకే
ఓట్ల లెక్కింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రెండు సూచనలకు ద్వివేది ఆమోదం తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఫారమ్ 17 సీలు అందజేయాలని, అదే విధంగా భోజన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు. వీటికి ద్వివేది ఆమోదం తెలిపారు.