ఆంధ్రప్రదేశ్‌

వెబ్‌సైట్‌లో టెన్ త మార్కుల షార్ట్ మెమోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 20: పదోతరగతి ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (బీఎస్సీఏపీ) వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైబ్‌సైట్‌లో లాగినై పాఠశాల ఫలితాలలోకి వెళ్ళి విద్యార్థి హాల్‌టికెట్ (రోల్‌నెంబర్) మీద క్లిక్ చేసి మార్క్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న ప్రింట్‌ను సదరు ప్రధానోపాధ్యాయుని సంతకం, పాఠశాల ముద్రతో విద్యార్థులకు అందజేయాలన్నారు. ఈ షార్ట్ మెమోలను ఇంటర్ ప్రవేశాల కోసం ఉపయోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.