ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మే 21: వ్యవస్థలను, న్యాయస్థానాలను, ఎలక్షన్ కమిషన్‌ను దేన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మే పరిస్థితి లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఓటమి ఖాయమని తెలిసిన చంద్రబాబు ఈవీఎంలపై నెపం నెట్టే దురాలోచన చేస్తున్నారన్నారు. కౌంటింగ్ రోజు అరాచకాలను సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ రోజున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతీయ రాజకీయాల అంశంలో ఏపీ ప్రయోజనాలకే వైసీపీ పెద్ద పీట వేస్తుందన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరాచకాలు సృష్టించే బాబు ముఠా కదలికలపై పోలీసు యంత్రాంగం, ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సందర్భంగా బాబు బృందం చేస్తున్న నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇంటిలిజెన్స్ డీజీని ఈసీ బదిలీ చేసిందన్నారు. కాని దీనిపై ఒక జీఓ విడుదల చేసి, కోర్టుకు వెళ్లి పిల్లిమొగ్గ వేశారన్నారు. వీటితో పాటు వీవీ ప్యాట్లు, చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంలో కూడా బాబుకు కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు గెలుపు ఓటములను హుందాగా స్వీకరించాలన్నారు. అసలు ఇంట్లో గెలిచే పరిస్థితి లేని చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఎలా రాణిస్తారని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్‌ను, ఈవీఎంలను, కోర్టులను, వ్యవస్థలను నమ్మని చంద్రబాబు.. ఏబీ వెంకటేశ్వరరావును మాత్రమే నమ్ముతారన్నారు. గురువారం విడుదలయ్యే ఫలితాలను కూడా చంద్రబాబు నమ్మరన్నారు. ఫలితం వ్యతిరేకంగా వస్తే ఈవీఎంలపై చంద్రబాబు కచ్చితంగా నిందలు వేస్తారన్నారు. ప్రజాదరణ లేదన్న విషయాన్ని గుర్తించిన బాబు ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నంలో ఈసీపై నెపం నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో టీడీపీ నేతలు గొడవలు రేపడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు వైసీపీ కార్యకర్తలు, పోలీసులు, ప్రజాస్వామ్యవాదులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశ చరిత్రలో ఎప్పటి నుండో ఎన్నికల్లో ప్రతిసారీ ఓట్ల శాతం పెరుగుతూనే ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే రీతిలో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. కానీ అదేదే తాను సూచిస్తేనే ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ గందరగోళం సృష్టిస్తున్నారని, వీవీ ప్యాట్‌ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సీనియర్ రాజకీయవేత్తగా చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. టీడీపీ నేతలు గెలుస్తున్నామనే పగటి కలలు కంటూ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఫలితాల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాకనే కేంద్రంలో అసలైన ఆట ప్రారంభమవుతుందన్నారు. జాతీయ వ్యవహారాల్లో వైసీపీ మాత్రం చాలా స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతు ఇస్తామని తమ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. వాస్తవంగా టీడీపీ ఓడిపోడం ఖాయమైనందునే చంద్రబాబు ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని రాంబాబు అన్నారు.