ఆంధ్రప్రదేశ్‌

రియల్‌టైమ్ నీటి నిర్వహణ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న రియల్ టైమ్ నీటి ప్రణాళిక, నిర్వహణ తీరును కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా ప్రశంసించారు. ఈ విధానాన్ని జాతీయ స్థాయిలో, మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు.
వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వేసవి తీవ్రత, వడగాలులు, కరవు తదితర అంశాలపై మంగళవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఏపీలో రియల్‌టైమ్‌లో నీటి నిర్వహణ, నిల్వ, ఆడిట్ చేస్తున్న తీరు బాగుందన్నారు. ఇతర రాష్ట్రాలు దీనిని అనుసరించాలన్నారు. రాష్ట్రాల వారీగా వర్షాభావ పరిస్థితులు ఎదురైతే, వాటిని అధిగమించేందుకు చేపట్టిన ముందస్తు ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత వల్ల ప్రజలు చనిపోకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సకాలంలో వర్షాలు కురవకపోతే ఏర్పడే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయాలని సూచించారు.
అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏపీలో వాటర్ రిసోర్సెస్ ఇన్‌ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ద్వారా వివిధ రిజర్వాయర్లు, ఇతర మంచినటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 100 రిజర్వాయర్లలో లెవెల్ సెన్సార్లను ఏర్పాటు చేశామని, మొబైల్ యాప్‌కు అనుసంధానం చేశామన్నారు. దీంతో రిజర్వాయర్లకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను తెలుసుకుని, ఆ ప్రకారం నీటి నిర్వహణ చేపడుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో 1200 ఫీజో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జల మట్టాలను రియల్ టైమ్‌లో అంచనా వేస్తున్నామన్నారు. 38 వేల మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లను ఉపగ్రహ సహాయంతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వివిధ నీటి వనరుల ఆధారంగా గ్రామ స్థాయి వాటర్ బడ్జెట్‌ను రూపొందించి, ఆ ప్రకారం వ్యవసాయ, గృహ, పరిశ్రమలు, ఇతర అవసరాలకు నీటిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. వడగాల్పుల నుంచి ఉపశమనం కల్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. తగినంత వర్షపాతం నమోదు కాకుంటే, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను అమలు చేస్తామన్నారు.