ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాలకు 10 మంది ఉపాధ్యాయులను బలి చేస్తూ వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ శ్రావణ్‌కుమార్, పీ రవిప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ఎన్నో ఏళ్లుగా ఓటు అనేది తెలియని గ్రామాల్లో డబ్బుతో పోలింగ్ కేంద్రాలను స్వాధీనపరచుకుంటూ రిగ్గింగ్‌కు పాల్పడే రాజకీయ పక్షాలను ప్రక్షాళన చేయకుండా ఉద్యోగులను సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. వీరి సస్పెన్షన్‌లపై ఎన్నికల కమిషన్ పునః పరిశీలించాలన్నారు.