ఆంధ్రప్రదేశ్‌

‘అనంత’ ఆదరణ ఎవరికి?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 22: హోరాహోరీగా సాగిన 2019 సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో అనంతపురం జిల్లాలో విజేతలెవరో, పరాజితులెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఓటర్ల తీర్పుపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం 186 మంది అభ్యర్థులు ఎన్నికల రణ క్షేత్రంలో తలపడ్డారు. టీడీపీ, వైకాపా మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నప్పటికీ ఏక పక్షంగా ఓటింగ్ జరగలేదనే చెప్పొచ్చు. బరిలో బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలిచారు.
టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రముఖుల భవితవ్యంపై సర్వత్రా ఆసక్తికర చర్చసాగుతోంది. రాయదుర్గం నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు, టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించి, రెండోసారి బరిలో దిగిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ, కుటుంబ రాజకీయ వారసులుగా రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్, తాడిపత్రి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ.అస్మిత్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పుట్టపర్తి నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో మూడోసారి బరిలో నిలిచిన చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డికి, ఆయన శిష్యుడు వైకాపా అభ్యర్థి దుద్దుకుంట శ్రీ్ధర్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. కల్యాణదుర్గం నుంచి 2009లో విజయం సాధించిన ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి కాంగ్రెస్‌ను గట్టేక్కించడంతో పాటు తన ఇమేజ్ కాపాడుకునేందుకు మరోమారు అక్కడి నుంచే బరిలో నిలిచారు. అభివృద్ధి మంత్రం ఫలిస్తుందని, తననే విజయం వరిస్తుందన్న ధీమాతో రఘువీరా ఉన్నారు. కాగా జనసేన, బీజేపీ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతో గెలుపు ఎవరిని వరిస్తుందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఎంపీ స్థానాల్లో అనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీ జేసీ.దివాకర్‌రెడ్డి వారసుడు జేసీ.పవన్‌రెడ్డికి, జిల్లా ప్రభుత్వ అధికారిగా పని చేసిన, వైకాపా అభ్యర్థి, బీసీ సామాజిక వర్గానికి చెందిన తలారీ రంగయ్య దీటుగా నిలిచారు. దివంగత మాజీ ఎంపీ నారాయణస్వామి దేవినేని మనవరాలు, న్యాయవాది దేవినేని హంస బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఓట్లు చీలి టీడీపీ, వైకాపా అభ్యర్థుల గెలుపును నిర్ధారించలేని పరిస్థితి ఏర్పడింది. కాగా హిందూపురం ఎంపీ అభ్యర్థుల్లో సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప రెండోసారి, వైసీపీ నుంచి కురుబ సామాజిక వర్గీయుడు, మాజీ సీఐ గోరంట్ల మాధవ్ మధ్య గట్టి పోటీ నెలకొంది.