ఆంధ్రప్రదేశ్‌

‘గోదావరి’ వైపే అందరి చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: మొత్తం అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ఐదో వంతు స్థానాలతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో నిర్ణయించే గోదావరి జిల్లాల్లో వేసవి ఉష్ణోగ్రతలకు తోడు రాజకీయ ఉష్ణోగ్రత తారాస్థాయికి చేరింది. విభజన అనంతరం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు మిగలడంతో 34 స్థానాలున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రెండు జిల్లాల ఫలితాలు కూడా దాదాపు ఒకే తీరున ఉంటుండటం, అందులోనూ తూర్పు గోదావరిలో అత్యధిక స్థానాలు గెల్చుకుంటే అధికారం ఖాయమనే సెంటిమెంటు ఇక్కడి విజయం కోసం అన్ని పార్టీల నేతలను పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్రంలో అధికారానికి కావలసిన మేజిక్ ఫిగర్ 88 సాధనలో గోదావరి జిల్లాల స్థానాలు అత్యంత కీలకమనడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ-బీజేపీ కూటమి అధికారం చేపట్టడానికి ఇక్కడ సాధించిన 29 స్థానాలు అండగా నిలిచాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా అయితే మొత్తానికి మొత్తం గుత్తగా 15 అసెంబ్లీ స్థానాలు ఈ కూటమికే కట్టబెట్టింది. అదేతీరున ఈసారి కూడా ఈ జిల్లాల్లో జయకేతనం ఎగురవేసి, అధికారం నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ, గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నుండి పాఠాలు నేర్చుకుని, అధికార సాధనకు అవసరమైన స్థానాలను ఈ జిల్లాలో నుండి గెల్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేన పార్టీ ఈ రెండు పార్టీలకు దీటుగా పోటీనిచ్చింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేయడం, ఈ రెండు జిల్లాల్లో ఉన్న అభిమానులకు తోడు, సామాజిక బలం అదనంగా కలవడం టీడీపీ, వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. మొత్తం మీద హోరాహోరీ పోరుసాగి, పోలింగ్ ముగిసి, కౌంటింగ్ ముగింట్లో ఉండటంతో ఫలితాలు ఎలావుంటాయో అనే విషయం మూడు పార్టీల్లోనూ గుబులు రేకెత్తిస్తోంది. అలాగే ఈ రెండు జిల్లాల్లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో సైతం మూడు పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు 223మంది అభ్యర్థులు పోటీచేశారు. మూడు లోక్‌సభ స్థానాలకు 36 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాలకు మొత్తం 187 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అదే విధంగా రెండు లోక్‌సభ స్థానాలకు 29 మంది అభ్యర్థులు పోటీచేశారు.
తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం కాకినాడలోని వివిధ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటుచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం ఏలూరులోని రెండు కళాశాలలు, భీమవరంలోని ఒక కళాశాలలో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటుచేశారు. నలభై రోజుల ఉత్కంఠకు తెరపడి, గురువారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతల్లో గుబులు నెలకొంది. ఓట్ల లెక్కింపులో కీలకమైన ఏజెంట్ల నియామకంతో గత రెండు రోజులుగా అన్ని పార్టీల నేతలు బిజీబిజీగా ఉన్నారు. అధికార యంత్రాంగం సైతం ఓట్ల లెక్కింపునకు పూర్తి ఏర్పాట్లతో సర్వసన్నద్ధమయ్యింది. ఫలితం అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ, మొత్తం మీద గురువారం మధ్యాహ్నానికి ఎవరు విజేతలు, ఎవరు పరాజితులో స్పష్టం కానుంది.