తెలంగాణ

స్వచ్ఛమైన గాలి కోసం నిరాహార దీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విషపూరిత వాయువుల బారి నుంచి తమను కాపాడాలని బాచుపల్లి వద్ద మైటాస్ హిల్‌కౌంటీ కాలనీ వాసులు బుధవారం వినూత్న పద్ధతిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. బొల్లారం తదితర ప్రాంతాల్లోని కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వాయువులతో తామ అనారోగ్యం పాలవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీలో ఉంటున్న వందలాది కుటుంబాలకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వాలంటూ వారు నిరసన తెలియజేస్తున్నారు. నోటికి నల్లటి గుడ్డలు కట్టుకుని ప్లకార్డులు చూపుతూ వీరు ఆందోళన ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇకనైనా మేల్కొని రసాయన పరిశ్రమల్ని కట్టడి చేసేలా కాలుష్య నియంత్రణ బోర్డుపై ఒత్తిడి తేవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.