ఆంధ్రప్రదేశ్‌

హోదాపై పిఎం సానుకూల ధోరణి: టిజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోందని టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. హోదా విషయాన్ని అభ్యర్థించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో ఆయన ‘‘ మీ సమస్య నా సమస్య’’ అని హామీ ఇచ్చారని, ఆయన తప్పకుండా రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటారని తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతోమాట్లాడుతూ ఎపికి ఎప్పటికైనా ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, ఈ లోపు రాష్ట్రం అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతుందని అన్నారు.