ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ తరహాలో వేతనాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 6: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి జీతాల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానే్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలుచేయాలని ఉపాధి హామీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేతనాల్లో వ్యత్యాసం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వారు కోరుతున్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో వలసలను తగ్గించేందుకు, కూలీలకు పని భద్రత కల్పించేందుకు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. పథకాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించి పనులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బందికి జీతాలు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. క్షేత్ర సహాయకులకు నెలకు 10వేల వంతున జీతం నిర్ణయించడంతోపాటు మిగిలిన కేటగిరీల సిబ్బందికి 20 శాతం జీతాలు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా జీతాలు పెంచాలని సిబ్బంది కోరుతున్నారు. అదనపు ప్రోగ్రామ్ అధికారులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సాంకేతిక సహాయకులు, క్షేత్రసహాయకుల జీతాల పెంపుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఆయా వర్గాల నుండి నిరసన వ్యక్తమవుతోంది. ఉపాధి హామీ పథకం అమలుకు కీలకమైన 13,500 మంది క్షేత్ర సహాయకులు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. వీరికి నెలకు 5,400 రూపాయల వేతనం మాత్రమే లభిస్తోంది. అలాగే రాష్ట్రంలో సుమారు 2వేల సాంకేతిక సహాయకులుండగా 6790 ప్రారంభ బేసిక్‌తో 9,800 రూపాయలను వేతనం చెల్లిస్తున్నారు. తమతో ఉపాధి హామీ పనులే కాకుండా వివిధ రూపాల్లో సేవలు చేయించుకుంటున్నారని వీరు వాపోతున్నారు. ముఖ్యంగా పథకం నిర్వహణలో 75 శాతం ప్రగతి కనబరచలేదన్న కారణంతో రాష్ట్రంలో 3845 మంది క్షేత్ర సహాయకులను ప్రభుత్వం శాశ్వతంగా విధుల నుండి తొలగించింది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ విచారణ అనంతరం వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ఐతే విధుల్లోకి తీసుకుని 13 నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడం సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. తమ డిమాండ్లను కమిషనర్‌కు వివరిస్తూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ప్రకటిస్తామని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు.