ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి పనుల్లో ఆంధ్రా ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 6: ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకురాలు సుపర్ణ ఎస్.పచౌరీ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ఇంటర్ స్టేట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ ముగింపు శనివారం జరిగింది. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మంది అధికారులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో క్షేత్ర పర్యటనలు చేశారు. ఉపాధి పనుల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను వారు పరిశీలించారు. ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి పనుల్లో టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం అమలు పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ఈ తరహా విధానాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 10 ఏళ్ళుగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నామని, నిరుపేదలకు ఉపాధి పనులు కల్పించడం ద్వారా గ్రామాల్లో వౌలిక సదుపాయాలు, సామాజిక ఆస్తుల కల్పనకు వీలు పడుతోందన్నారు. ఉపాధి హామీ అమలులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు గమనించేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. టెక్నాలజీ కారణంగా సకాలంలో 93 శాతం మేరకు వేతనాలు చెల్లించే వీలు కలుగుతోందని తాము గమనించామన్నారు.