ఆంధ్రప్రదేశ్‌

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి నగరంలో ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం రామారావు, అసెంబ్లీకి ఎన్నికైన కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎం నాగార్జున, సాధారణ పరిపాలనా శాఖ అదనపు సెక్రటరీ (ప్రొటోకాల్) ఎం అశోక్‌బాబు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, డీసీపీలు వై రవిశంకర్‌రెడ్డి, వీ హర్షవర్ధన్ రాజుతో ఆదివారం చర్చించారు. నగరంలోని ముఖ్యకూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలని, షామియానాలు వేసి అవసరమైనచోట మంచినీరు, మజ్జిగ అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉయ్యూరులో ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, వచ్చే సామాన్య ప్రజానీకానికి ప్రమాణ స్వీకారోత్సవం వీక్షించేలా స్టేడియంలో స్థలం కేటాయించాలని నిర్ణయించారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, న్యాయమూర్తులు హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రధాన వేదిక ముందుభాగంలో వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారికి ప్రత్యేక పాస్‌లు జారీ చేయనున్నారు. నగరంలోని నాలుగువైపులా ప్రధాన కూడళ్ల వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, స్థానిక ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయడంతో పాటు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని షెడ్లు, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏఆర్ గ్రౌండ్స్, బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లలో వాహనాల పార్కింగ్‌కు చర్యలు తీసుకుంటున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, సామాన్య ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు.
నిరాడంబరంగానే..
ఐజీఎం స్టేడియంలో వేదిక, వీవీఐపీ, విఐపీ, మీడియా, సామాన్య ప్రజలు వీక్షించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆదివారం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అనంతరం కొలుసు పార్థసారథి విలేఖరులతో మాట్లాడుతూ తొమ్మిదేళ్ల తెలుగువారి నిరీక్షణ ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు సాకారం కాబోతోందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాజశేఖరరెడ్డిపై చూపిన విశ్వాసాన్ని ప్రజలు జగన్ పైనా చూపి ఆశీర్వదించారన్నారు. ప్రజలు రాజన్న రాజ్యం రావాలని కలలు గన్నారని, అది నెరవేరుతోందన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సామాన్య ప్రజలు కూడా ప్రమాణస్వీకారోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేదిక వద్దకు చేరుకోలేకపోయిన వారు కూడా వీక్షించేలా స్టేడియం వద్ద, మరో పది ప్రాంతాల్లో, నగరంలోని ముఖ్య కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రమాణస్వీకారోత్సవాన్ని తిలకించేలా టీవీల ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని పార్థసారథి వివరించారు. సమావేశంలో జేసీ-2 బాబూరావు, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.