ఆంధ్రప్రదేశ్‌

శరత్‌బాబు, చంద్రబోస్‌కు జాలాది పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(కల్చరల్), ఆగస్టు 6: జనరంజకమైన గీతాలతో సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న ప్రసిద్ధ కవి డాక్టర్ జాలాది పేరిట జాలాది చారిటబుల్ ట్రస్టు నెలకొల్పిన జాతీయస్థాయి పురస్కార ప్రదానోత్సవం 9న కళాభారతిలో నిర్వహిస్తున్నట్టు ఎయు రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాలాది 85వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి కొత్తగా జాతీయస్థాయి ప్రతిభకు గుర్తింపుగా జాలాది సాఫల్య పురస్కారం-2016 ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు విలక్షణ నటుడు శరత్‌బాబును ఎంపిక చేశామని, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌కు జాలాది ఆత్మీయ పురస్కారానికి ఎంపిక చేశామని వెల్లడించారు. జాలాది ట్రస్టు ప్రధాన కార్యదర్శి జాలాది విజయ మాట్లాడుతూ తన తండ్రి 1800 చిత్ర గీతాలు రాసి అందరి అభిమానాన్ని పొందారని, 2012 నుంచి ఈ అవార్డులు అందజేస్తున్నామన్నారు. ఈ అవార్డు కింద 50 వేలు నగదు, సన్మానం చేస్తామన్నారు. ఈ సందర్భంగా అంధుల పాఠశాలకు, వీధి బాలలకు రూ.లక్షన్నర వితరణ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో స్నేహాంజలి సంస్థ సారథి మూర్తి తదితరులు పాల్గొన్నారు.