ఆంధ్రప్రదేశ్‌

లాడ్జీలు ఫుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 7: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరానికే మూడున్నర కోట్ల మంది యాత్రికులు రాగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో ప్రధానంగా హోటళ్లు, లాడ్జీలపై ఊహించని రీతిలో తాకిడి పెరిగింది. నగరంలో స్టార్ కేటగిరి హోటల్స్‌సహా ఇతరత్రా లాడ్జీలవరకూ దాదాపు నాలుగువేల గదులున్నాయి. అయితే బందోబస్తు, ఇతరత్రా విధులు నిర్వర్తించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్న సిబ్బంది కోసం అధికారులు ప్రతి హోటల్‌లోను 20 శాతం గదులను ఈ నెల 10 నుంచి బ్లాక్ చేశారు. అంటే 800 గదులు అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. దీనికితోడు అనధికారికంగా ప్రతి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రతి హోటల్‌లోనూ తమ కోటా కింద కొన్ని గదులను రిజర్వ్ చేసుకున్నారు. ఇక తరచూ వచ్చే కస్టమర్లు తమకున్న పరిచయాలతో ఫోన్‌ల ద్వారా ముందస్తుగా గదులను రిజర్వ్ చేసుకుంటున్నారు. పుష్కరాలు సమీపిస్తున్న కొద్దీ పలు విధాలుగా ఒత్తిళ్లు వస్తుండటంతో హోటళ్ల యజమానులు పగటివేళలో హోటళ్లవైపు రాకుండా ముఖం చాటేస్తున్నారు. సెల్‌ఫోన్లకు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఇదిలాఉంటే రద్దీని కొంతమేరయినా తట్టుకునేందుకు గాను 50శాతం అద్దెతో12 గంటల చొప్పున గదులను అద్దెకు ఇచ్చుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.