ఆంధ్రప్రదేశ్‌

గోదారి తీరానికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 7: గోదావరి అంత్య పుష్కర స్నానానికి జనం పోటెత్తారు. అంత్య పుష్కరాలు ఆదివారానికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ లక్షలాదిగా పుణ్య స్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరంలోనీ పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. నాగపంచమి మరింత ప్రసిద్ధంగా భావించి అత్యధికంగా పుణ్య స్నానాలకు వచ్చినట్టు సమాచారం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారు అత్యధికంగా పుణ్య స్నానాలకు వచ్చినవారిలో ఉన్నారు. ఆదివారం ఒక్క రోజే దాదాపు 2 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అంచనా. మరోవైపు గోదావరి నది ఉద్ధృతి పెరుగుతుండటంతో నదిలో స్నానాలకు వీలుగా మట్టాన్ని క్రమబద్ధీకరించారు.

చిత్రం... కిటకిటలాడుతున్న రాజమహేంద్రవరం పుష్కరఘాట్