ఆంధ్రప్రదేశ్‌

సోషల్ మీడియా కథనాలు నిజం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: జర్నలిస్టులకు ప్రోత్సాహకాలు కల్పిస్తూ తన పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తా కథనం వాస్తవం కాదని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తాను సమావేశమై జర్నలిస్టులకు అలవికాని హామీలు ఇచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మంత్రి క్యూలైన్‌లో నిలుచుని భోజనం చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన కథనంపై స్పందించారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు అక్రెడిటేషన్లు పొడిగించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సమాచారశాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్‌రెడ్డిని ఆదేశించారు.