ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూన్ 12: నవ్యాంధ్రప్రదేశ్ కొత్త శాసనసభ సమావేశాలు బుధవారం సందడిగా ప్రారంభమయ్యాయి. కొత్త ఎమ్మెల్యేలు మొదటిసారిగా అడుగుపెడుతున్న సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణాన్ని సుందరంగా అలకరించారు. అసెంబ్లీ భవనం ప్రధాన ద్వారం, ముఖ్యమంత్రి వెళ్లే ద్వారాల వద్ద అందమైన పూలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. అసెంబ్లీకి హాజరైన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అసెంబ్లీ అధికారులు స్వీట్ బాక్స్‌లను పంపిణీ చేశారు. సమావేశాలకు హాజరైన వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరికొకరు లాబీల్లో ఎదురుపడిన సందర్భంలో పార్టీలతో సంబంధం లేకుండా పరస్పరం కరచాలం చేసుకోవడం కనిపించింది. అలాగే యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులకు టీడీపీ ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొడాలి నాని, టీడీపీ ఉరవకొండ ఎమ్యెలే పయ్యావుల కేశవ్ ఎదురుపడిన సందర్భంలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ పలకరించి కొద్ది సేపు మాట్లాడారు. మరో మంత్రి పేర్ని నానిని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి కృష్ణదాస్‌లను టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు లాబీల్లో ఎదురుపడిన సందర్భంలో పలకరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు గద్దె రామోహన్ వీరిని పలకరించి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కొద్దిసేపు లాబీల్లో ముచ్చటించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కాళ్లు మొక్కటంతో అందరూ ఆశ్చర్యంగా తిలకించారు. అలాగే అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున వైసీపీ, టీడీపీలకు చెందిన ద్వితీయ, త్రితీయ శ్రేణి నాయకులు కూడా పెద్ద ఎత్తున లాబీల్లో సంచరించారు. తమ అభిమాన నాయకులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిపక్షానికి ప్రస్తుతం తాత్కలిక ఛాంబర్‌ను అధికారులు కేటాయించారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, టీడీఎల్పీకి పక్కపక్కనే ఛాంబర్లను అధికారులు కేటాయించారు. గతంలో మంత్రి లోకేష్ ఉపయోగించిన ఛాంబర్‌ను టీడీఎల్పీకి, ఉపసభాపతి ఛాంబర్‌ను ప్రతిపక్షనేత చంద్రబాబుకు అసెంబ్లీ అధికారులు కేటాయించారు. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణించే కాన్వాయ్ కోసం అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు కాన్వాయ్‌ని మాత్రం ఎమ్మెల్యేలు వచ్చి వెళ్లే ప్రధాన ద్వారంలోనే అనుమతించారు. అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం అవుతాయనగా ఎమ్మెల్యేలు వెళ్లే ద్వారం గుండానే ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలోనికి ప్రవేశించారు. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులు అసెంబ్లీ లోకి ప్రవేశించి ఏపీ శాసనసభ భవనాలను అసక్తిగా తిలకించారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు వారి వారి ధృవపత్రాలను అసెంబ్లీ అధికారులుకు సమర్పించేందుకు అసెంబ్లీ పైఅంతస్తుకు చేరుకుని, అధికారుల ఛాంబర్ల కోసం వెతుక్కొవడం కనిపించింది. జీతభత్యాలు, ఎలవెన్సుల కోసం ఎమ్మెల్యేలు సంబంధిత పత్రాలను అసెంబ్లీ అధికారులకు ఛాంబర్ల వద్ద అందజేశారు. అసెంబ్లీకి హాజరైయ్యే సభ్యులు వచ్చే వాహనాలను గతంలో బయటనే వదిలి అసెంబ్లీ ప్రాంగణంలోనికి వచ్చేవారు. కేవలం విప్‌లు, మంత్రులు, సీఎం, ప్రతిపక్షనేతల వాహనాలను మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోనికి అనుమతిచ్చేవారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం అందుకు భిన్నంగా కొందరు ఎమ్మెల్యేలు వారి వారి వాహనాలను సరా సరి అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద వరకూ తీసుకురావడం ఎక్కువగా కనిపించింది.

చిత్రాలు.. అసెంబ్లీలోకి వెళ్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, చినరాజప్ప