ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు కాన్వాయ్ కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి కాన్వాయ్ కుదింపుపై ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు కుదించిన వాహన శ్రేణిలో అసెంబ్లీకి బుధవారం వచ్చారు. జడ్ ప్లస్ కేటగిరిలో పైలట్, ఎస్కార్ట్1, ఎస్కార్ట్2, జామర్, వీఐపీ స్పేర్, ఎన్‌ఎస్‌జి 1, ఎన్‌ఎస్‌జి 2 వాహనాలతో కాన్వాయ్ ఉండాలి. తాజాగా కాన్వాయ్‌లో పైలట్ క్లియరెన్సు వాహనం, ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించారు. దీనిపై టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చంద్రబాబు కాన్వాయ్‌లో ఎటువంటి మార్పులు చేయాలన్నా, భద్రతా వ్యవహారాల కమిటీలో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్ల ఇలా జరిగిందని భావిస్తున్నారు. ప్రతిపక్ష నేత కాన్వాయ్‌కు ఏ-2 గేటు నుంచి లోపలికి ప్రవేశించే వీలు ఉంటుంది. మంత్రుల వాహనాల వద్ద ప్రతిపక్ష నేత వాహనాలను పార్క్ చేసుకునే వీలు ఉండేది. కానీ తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను పాటించకపోవడంపై టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ప్రవేశించే ద్వారం ద్వారానే అసెంబ్లీలోకి చంద్రబాబు వెళ్లడం గమనార్హం. ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.