ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ రంగ సంస్కరణలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 14: విద్యుత్‌రంగ సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. డిమాండ్‌కు తగ్గట్టుగా గ్రిడ్‌ల నిర్వహణతో పాటు సరసమైన ధరలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉన్నతాధికారులకు తగిన సూచనలిచ్చారు. విద్యుత్ ప్రయోజనాలు అన్ని వర్గాలకు అందాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షగా చెప్పారు. అన్ని సీజన్లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా అవసరాలకు తగ్గట్టుగా సరఫరాను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ మాత్రం అంతరాయం లేకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రత పెరగటంతో పాటు బొగ్గు రవాణాకు కొరత ఏర్పడిందని, పవన విద్యుదుత్పాదన గణనీయంగా తగ్గిందన్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగానికి తగిన ఉత్పాదకతకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఇంధనశాఖ కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ ఐదువేల మందికిపైగా విద్యుత్‌రంగ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రుతుపవనాల రాక ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో విద్యుదుత్పాదనకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 189 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందని, గతేడాది కంటే 7.59 శాతం పెరుగుదల ఉందన్నారు. ఏసీల వినియోగం వల్ల గృహ విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్తూ గత ఏడాది కంటే ప్రస్తుతం రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగటమే ఇందుకు కారణమన్నారు. ఏది ఏమైనా రుతుపవనాలకు ముందే ఫీడర్ల నిర్వహణపై దృష్టిసారించాలని శ్రీకాంత్ సిబ్బందని ఆదేశించారు. 33కేవీ, 11 కేవీ ఫీడర్లను తనిఖీచేసి అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ట్రీ కటింగ్ ప్రక్రియ చేపట్టాలన్నారు. సిస్టం ఏవరేజ్ ఇంటరప్షన్ డ్యురేషన్ ఇండెక్స్ (ఎస్‌ఏఐడి), సిస్టం ఏవరేజ్ ఇంటరప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్ (ఎస్‌ఏఐఎఫ్‌ఐ)ల ద్వారా ఫీడర్ల నిర్వహణ చేపట్టాలన్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బందితో పాటు సంబంధిత ఇంజనీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నియంత్రించాలని ఆదేశించారు. అవసరమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, స్తంభాలు, ప్రధాన వైర్లను సిద్ధం చేసుకుని సరఫరాలో అంతరాయాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు సరిచేయటం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈపీడీసీఎల్ సీఎండి రాజబాపయ్య, ఎస్పీడీసీఎల్ ఇన్‌చార్జి సీఎండీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రుతుపవనాల ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 90 శాతం ఫీడర్ల తనిఖీ పూర్తయిందని తెలిపారు. విద్యుత్ రంగ సలహాదారు కె రంగనాధం, ప్రభుత్వ సలహాదారు కె ఉమాపతి, డైరెక్టర్లు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.