ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో నవరత్నాలు చదివారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూన్ 14: నూతన ప్రభుత్వం పనితీరు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడనే అనే సామెతను గుర్తుకు తెస్తోందని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కే అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, నిమ్మల రామనాయుడు, ఎమ్యెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలు తీసుకొచ్చి రాష్ట్ర గవర్నర్‌కు ఇచ్చి అసెంబ్లీలో చదివించిన ఘనత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్‌లో ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన లేకపోవడం ఈప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. యువత, ఉపాధి, పరిశ్రమల స్ధాపన, ఆదాయ మార్గాల పెంపుదల, తదితర అంశాల గురించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దశగా అడుగులు వేస్తుందని అందరూ భావిస్తే కేవలం పార్టీ ప్రచారం తప్ప గవర్నర్ ప్రసంగంలో మరొకటి కనిపించలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజలకు వైకాపా ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రజల తరపున అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా టీడీపీ పోరాడుతుందన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి చివరకు వాటిని అమలు చేసేందుకు కమిటీలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయటానికి ఇప్పటి నుండే ప్రయత్నిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలకు పరిష్కారంపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణకు చెక్ అంటూ జరుగుతున్న పనులను అడ్డుకుంటూ మరొక వైపు ఇసుకపై ప్రభుత్వానికి ఒక అవగాహన ఉందని ప్రకటనలు చేయటం ఎంతవరకు సమంజమని వారు ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వరాలు ఏమీ లేవన్నారు. చంద్రబాబునాయుడు హయాంలోనే రైతులను అన్ని రకాలుగా అందుకోవటంతోపాటు, రైతన్నకు అసలైన భరోసా ఇచ్చారన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని కులాల సంక్షేమం కోసం చంద్రబాబునాయుడు హాయంలోనే వివిధ రకాలైన పథకాలను ప్రవేశ పెట్టి వాటిని అమలు చేసి లక్షలాది మందిని అందుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత సీఎం జగన్ కేవలం నాలుగు బీసీ కులాల సంక్షేమ కోసమే పథకాలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారన్నారు. కట్టుబట్టలతో రోడ్ల మీదకు వచ్చిన సమయంలో చంద్రబాబునాయుడు ఎంతో ధైర్యంతో రాజధాని అమరావతిని నిర్మించి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో బలోపేతం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. యువత, ఉపాధి కల్పన, పరిశ్రమల స్ధాపన, పెట్టుబడులు, తదితర అంశాలను గాలికి వదిలేసిన ఈప్రభుత్వం ఆర్ధికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళుతుందని వారు ప్రశ్నించారు. గంటల వ్యవధిలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంటూ చెప్పిన జగన్ కొత్తగా కమిటీలు వేయటం గమనిస్తే ఈ ప్రభుత్వానిది కేవలం ప్రచారార్భాటమేననేది మరోసారి స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. ప్రజల సంక్షేమ, రాజధాని నిర్మాణం, తదితర అంశాలను ఈప్రభుత్వం గాలికి వదిలి పెట్టిందన్నారు.