ఆంధ్రప్రదేశ్‌

దాడులు ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: టీడీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనడమే తక్షణ కర్తవ్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. గత మూడు వారాల్లో 100కు పైగా దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమికి కారణాలు కనబడని పరిస్థితి ఉందని, ప్రభావితం చేసిన అంశాలపై అధ్యయనం చేయాలని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశే్లషించేందుకు టీడీపీ అభ్యర్థులతో విజయవాడలో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చి 22 రోజులైందని, సీట్లు తగ్గినా ఓట్ల శాతం గణనీయంగా ఉందని వ్యాఖ్యానించారు. ఓటమికి కారణాలు విశే్లషించుకున్నామని, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడానని తెలిపారు. 37 సంవత్సరాల్లో 5 సార్లు గెలిచామని, 4 సార్లు ఓడిపోయామని గుర్తు చేశారు. గెలిచినప్పుడు ఆనందం, ఓడినప్పుడు ఆవేదన సహజమన్నారు. అయినా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ఏదోఒక కారణం ఉందని, కానీ ఈ సారి ఎన్నికల్లో ఓటమికి కారణాలు కనబడని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గెలుపు ఓటములు సహజమని, కానీ టీడీపీ శాశ్వతమన్నారు. భావితరాలకు పార్టీని అందించాల్సిన అవసరం ఉందని, గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం సరికాదన్నారు. విభజన తరువాత రాష్ట్రంలో దిక్కుతోచని పరిస్థితి ఉందని, ఆర్థిక లోటు ఉన్నా అభివృద్ధిలో దూసుకుపోయామని, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఓటమికి దారితీసిన అంశాలు పరిశీలించాలని, ఓటర్లను ప్రభావితం చేసిన అంతర్గత, బయటి అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలన్నారు. ఒక రాజకీయ పార్టీగా ప్రజల పట్ల బాధ్యత ఉందన్నారు.
మనకు ఓట్లేసిన ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉండాలని, వారి ప్రయోజనాలే ముఖ్యమన్నారు. దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కొనడం తక్షణ కర్తవ్యమన్నారు. అనంతపురం జిల్లాలో హత్యలు, గుంటూరు జిల్లా పల్నాడులో హత్య, కార్యకర్తలపై దాడులు, శిలాఫలకాల ధ్వంసం, బత్తలపల్లిలో అంగన్‌వాడీ భవనం కూల్చివేత, మచిలీపట్నంలో శిలాఫలకం పగులగొట్టడం, అన్న క్యాంటీన్ల బోర్డుల మార్పు, చుండూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు, బ్రహ్మసముద్రం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు వంటి అనేక అరాచకాలు 22 రోజుల్లోనే జరిగాయన్నారు. 5 సార్లు గెలిచినా ఎప్పుడూ ప్రత్యర్థులపై దాడులు చేయలేదన్నారు. కానీ ప్రత్యర్థులు గెలిచిన సందర్భాల్లో టీడీపీపై దాడులు జరపడం రివాజుగా మారిందని మండిపడ్డారు. దాడులు ఎక్కడ జరిగినా పార్టీ స్థానిక నాయకత్వం తక్షణమే స్పందించాలన్నారు. జిల్లా పార్టీ నేతలు బాధితుల వద్దకు వెళ్లి భరోసా కల్పించాలన్నారు. పార్టీ కోసం చాలా మంది కార్యకర్తలు బలిదానాలు చేశారని, తమను నమ్ముకున్న వర్గాలకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరూ ఒంటరి వారు కాదని, సామూహిక శక్తి అని, ప్రతి కార్యకర్త వెంట లక్షలాది కార్యకర్తలు వెన్నంటి ఉన్నారన్నారు. ఎన్నికల తరువాత కార్తకర్యలపై దాడులు-దౌర్జన్యాలు అన్న అంశంపై జరిగిన చర్చలో అనంతపురంలో జరిగిన దాడుల గురించి పార్థసారథి, గుంటూరు జిల్లాలో జరిగిన దాడుల గురించి జీవీ ఆంజనేయులు, కర్నూలు జిల్లాలో జరిగిన దాడులపై కేఈ ప్రతాప్, కడప జిల్లా పరిస్థితుల గురించి శ్రీనివాసరెడ్డి వివరించారు. వినుకొండ, గురజాల, నరసారావుపేట, డోన్‌లో జరిగిన దాడులపై చర్చించారు. హత్యలు, రాళ్ల దాడులు, జెండా దిమ్మెల ధ్వంసం, ఆస్తుల విధ్వంసంపై చర్చించారు. వైకాపా దాడులను పార్టీ సమావేశంలో ఖండించారు. మృతి చెందిన కార్యకర్తలకు నివాళులు అర్పించారు.