ఆంధ్రప్రదేశ్‌

మాజీలకు భద్రత తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 15: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని జిల్లా అర్బన్, రూరల్ ఎస్‌పీలు వెనక్కు రప్పించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా భద్రత తొలగించడంతో మాజీలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు మంత్రులుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, నర్సరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు తొలగించారు. వీరితో పాటు 2 ప్లస్ 2 కేటగిరిలో సెక్యూరిటీ పొందుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, పెదకూరపాడు, పొన్నూరు, తెనాలి మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీ్ధర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల గన్‌మెన్, ఇతర సిబ్బందిని పూర్తిగా తొలగించారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ స్పీకర్, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావులకు మాత్రం భద్రతను తగ్గించినప్పటికీ కొనసాగిస్తున్నారు. కాగా ఈ ఇద్దరు మాజీలకు ఇప్పటివరకు 2 ప్లస్ 2గా ఉన్న గన్‌మెన్‌లను 1 ప్లస్ 1గా కుదించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులపై దాడులు పెరిగాయంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. సమస్యాత్మక ప్రాంతాలు అత్యధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో నివసించే మాజీలకు భద్రత కొనసాగించాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు.