రాష్ట్రీయం

దగా, మోసంలో బాబుకు డాక్టరేట్ ఇవ్వొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర విభజన కోసం తెలుగుదేశం పార్టీ మద్దతు పలికి రెండుకళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిందని మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఆపై ఓటుకు నోటు కేసుతో పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలి అమరావతికి పరారై వచ్చారని, అన్నీ తాత్కాలిక భవనాలు నిర్మించి అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని నిలువునా దోచేశారని ఆరోపించారు. మంగళవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.
గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు: బుగ్గన
గవర్నర్ ప్రసంగంలో తమ ప్రభుత్వం ప్రాధాన్యతాంశాలను మాత్రమే పొందుపరచిందని, దీనిపై టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి రాజేంద్రనాధ్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తమకు 63 మంది సభ్యుల బలం ఉన్నప్పటికీ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం చెప్తున్న వృద్ధిరేటుపై పరిశీలన జరుపుతామన్నారు. ఆశా వర్కర్ల వేతనాల పెంపుదలపై విధివిధానాల రూపకల్పన జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అడిగిన ప్రశ్నపై స్పందించారు. పింఛన్లను దశలవారీ చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించామని వివరించారు.
రుణమాఫీ చేయకే ఓడిపోయారు: మంత్రి ఆదిమూలపు సురేష్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతుల రుణమాఫీ చెల్లించనందునే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రుణమాఫీ డబ్బు చెల్లించకుండా పసుపు- కుంకుమకు మళ్లించి రైతుల్ని వంచించారని మండిపడ్డారు.
జన్మభూమి కమిటీల దోపిడీ: శ్రీకాంత్‌రెడ్డి
తాము అభివృద్ధి చేశామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు గ్రామాలకు వస్తే జన్మభూమి కమిటీల దోపిడీ తెలుస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీ సభ్యులు బంగ్లాలు కడితే టీడీపీ నేతలు బెంజ్ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. విభజన అంటూ తెలంగాణకు ఒప్పుకుని లేఖ ఇచ్చింది టీడీపీ కాదా అని నిలదీశారు. దీన్ని ముఖ్యమంత్రి జగన్ మాత్రమే వ్యతిరేకించారని తెలిపారు.
అభివృద్ధిపై సభ సాక్షిగా అసత్యాలు: కోలగట్ల
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో శాసనసభ సాక్షిగా అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. విజయనగరంలో జూట్‌మిల్లు మూసివేసి కార్మికులు వీధినపడితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
రుణమాఫీ పేరిట వంచన : గోవర్థనరెడ్డి
తెలుగుదేశం పార్టీ బేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి రైతుల్ని నిట్టనిలువునా ముంచిందని ఎమ్మెల్యే కాకాని గోవర్థనరెడ్డి దుయ్యబట్టారు. బేషరతు రుణమాఫీ చేస్తామన్నారో, లక్షన్నర ఇస్తామన్నారో తేల్చాలని సభలో పట్టుపట్టారు.
ఆరోగ్యశ్రీలో అవకతవకలతో ఖజానాకు తూట్లు: సామినేని
ఆరోగ్యశ్రీ పథకంలో టీడీపీ హయాంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను విజ్ఞప్తి చేశారు. ఒక వర్గానికి చెందిన వారే దీనివల్ల లబ్ది పొందారని ఆరోపించారు.
రెయిన్ గన్లతో రూ.600 కోట్ల అవినీతి: కాపు రామచంద్రారెడ్డి
రెయిన్ గన్‌ల పేరుతో టీడీపీ నేతలు రూ. 600 కోట్లు దోచేశారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రెయిన్‌గన్‌ల వినియోగంపై పరిశీలన జరిపితే వాస్తవాలనేకం వెలుగులోకి వచ్చాయన్నారు. రైతులు కాని వారి పేరిట రెయిన్‌గన్‌లు మంజూరు చేశారన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు.
సీఎం సహాయనిధిలో దగా: మల్లాది విష్ణు
గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి పేరిట దగా చేసిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. నేరుగా కొందరు ఆస్పత్రుల నిర్వాహకులే సిఫార్సు లేఖలు రాసిన దాఖలాలు ఉన్నాయన్నారు.
ఈ పథకం పూర్తి స్థాయిలో దుర్వినియోగమైందని తెలిపారు. కాగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఎన్నికల ముందు సర్వేలు నిర్వహించిన ఓ మీడియా సంస్థకు చంద్రబాబు రూ. 12 వందల కోట్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.

చిత్రం...శాసనసభలో మాట్లాడుతున్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్