ఆంధ్రప్రదేశ్‌

భవిష్యత్‌లో మరికొందరు టిడిపిలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: రాయలసీమలో మంచి పేరున్న వ్యక్తి , రాజంపేట నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎంపిగా ఎన్నికైన ఎ సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఎపి టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఏన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కళావెంకటరావుతో పాటు సాయి ప్రతాప్, ఎంపి సిఎం రమేష్, కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మాజీ ఎంపి జి రామయ్య , సాయి ప్రతాప్ అల్లుడు లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళావెంకటరావు మాట్లాడుతూ సిఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతో సాయి ప్రతాప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో సాయి ప్రతాప్ టిడిపిలో చేరారని చెప్పారు. భవిష్యత్‌లో టిడిపిలో చాలా మంది చేరబోతున్నారని కళావెంకటరావు చెప్పిరు. ప్రతిపక్ష వైకాపా ప్రజాసమస్యలపై పోరాటం చేయలేకపోతోందని, దిశానిర్దేశం లేకుండా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాయి ప్రతాప్ మాట్లాడుతూ సిఎం చేపడుతున్న అనేక కార్యక్రమాలకు భావి తరానికి గట్టి పునాది వేయాలని నిర్ణయించుకుని టిడిపిలో చేరినట్టు చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి అంతా చర్చించుకుని కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సిఎం రమేష్ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రజాసమస్యలపై ఎన్నోమార్లు సాయిప్రతాప్ పోరడారని అన్నారు. మంచి పేరు తెచ్చుకున్న సాయి ప్రతాప్ టిడిపిలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. చంద్రబాబుది విజన్ అయితే జగన్‌ది అవినీతి అని అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు కృషికి ఆకర్షితులై, అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు సాయి ప్రతాప్ టిడిపిలో చేరడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాట్లాడుతూ సాయిప్రతాప్‌కు రాయలసీమలో మంచి పట్టు ఉందని అన్నారు.