ఆంధ్రప్రదేశ్‌

సుందర బృందావనంగా భవానీ ద్వీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: రాష్ట్ర రాజధాని అమరావతి వచ్చే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సందర్శించేలా భవానీ ద్వీపాన్ని తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌తో కలిసి నగరంలోని భవానీ ద్వీపాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్బంగా మంత్రి అవంతి విలేఖరులతో మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన భవానీ ద్వీపాన్ని అభివృద్ధి పరచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ద్వీపంలో ఆహ్లాదకరమైన మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టి సుందర బృందావనంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ద్వీపాన్ని సందర్శించే పర్యాటకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఉండవల్లి ప్రజాదర్బార్ మాదిరిగా మినీ కనె్వన్షన్ హాల్ నిర్మించి పర్యాటక ప్రియులు తమ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పర్యాటకులకు సమాచారం తెలిసేలా బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టులో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయిస్తామన్నారు. కృష్ణా జిల్లాలో సర్క్యూట్ టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా విజయవాడ, మోపిదేవి, మచిలీపట్నం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి వివరించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భవానీ ద్వీపాన్ని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పరిచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. భోజన ప్రియుల కోసం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి సంప్రదాయ భారతీయ వంటకాలతో పాటు విదేశీ వంటకాల పోటీలు నిర్వహించనున్నామన్నారు. 24గంటలు బోటింగ్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు విష్ణు, రమేష్ మాట్లాడుతూ రాజధానికి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో భవానీ ద్వీపంలో తగిన అతిథ్యం అందించేలా వసతి సౌకర్యాలు పెంచలసిన అవసరం ఉందన్నారు. తొలుత మంత్రి అవంతి భవానీ ద్వీపంలో పర్యాటకుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ టీవీఎస్‌జీ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం...భవానీ ద్వీపంలో చిన్నారుల పార్క్‌ను పరిశీలిస్తున్న మంత్రులు అవంతి, వెలంపల్లి