ఆంధ్రప్రదేశ్‌

చివరి ఘట్టానికి అంత్య పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/్భద్రాచలం, ఆగస్టు 9: జీవనది గోదావరి అంత్య పుష్కర క్రతువు చివరి ఘట్టానికి చేరింది. ఇక కేవలం 48 గంటలు మాత్రమే గోదావరి నదిలో పుష్కర ప్రభావం ఉండనుండటంతో స్నానాలకు భక్త జనం తహతహలాడుతున్నారు. చివరి రెండు రోజుల్లో గోదావరి నది అంత్య పుష్కర స్నానం ముగించుకుని 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు భక్తులు వెళ్ళే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనావేస్తున్నారు. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు కలిగిన గోదావరి నదిలో మాత్రమే ఏడాదిపాటు గురుడు సింహ రాశి ప్రవేశం ద్వారా పుష్కర ప్రభావం వుంటుంది. ఆ తదుపరి 12వ తేదీ నుంచి గురుడు కన్యారాశి ప్రవేశంతో కృష్ణా పుష్కరాలు ఆరంభమవుతోన్న క్రమంలో రెండు స్నానాలు కలసి వస్తాయని భావించిన యాత్రికులు చివరి రెండు రోజుల్లో రాజమహేంద్రవరం నుంచి కృష్ణా పుష్కరాల నిమిత్తం విజయవాడ వెళ్తారని అంచనా వేస్తున్నారు. కాగా శ్రావణ మంగళవారం కావడంతో అంత్య పుష్కర స్నానాలు కాస్తంత మందకొడిగానే సాగాయి. మొత్తం 58 వేల మంది యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో మాత్రం రద్దీ యథాతథంగా కొనసాగింది. గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టే భక్తుల సంఖ్య కూడా మంగళవారం కాస్తంత తగ్గింది. బుధవారం, గురువారం కూడా ఒడిస్సా యాత్రికుల రద్దీతో పాటు ఇతర ప్రాంతాల రద్దీ కూడా వుంటుందని అంచనావేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా పుష్కర బందోబస్తుకు వెళ్లిన పోలీసులను వెనక్కి రప్పించి, ఇటు ముఖ్యమంత్రి రాజమహేంద్రవరం పర్యటనతో పాటు అటు అంత్య పుష్కర చివరి రెండు రోజుల బందోబస్తు నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్నారు. అంత్య పుష్కర స్నానాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు అధికంగా కన్పించారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుంచి ప్రతీ రైలు నుంచి సుమారు రెండు మూడు వేల మంది చొప్పున యాత్రికులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. భద్రాచలం వద్ద పెరుగుతున్న భక్తులు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద అంత్యపుష్కరాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. 10వ రోజు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పునర్వసు మండపంలో ప్రచారమూర్తులను ఉంచి పుష్పోదక స్నపనం చేశారు.
ముగింపు రోజే.. కృష్ణా పుష్కరాలు
విజయవాడ: పనె్నండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాల సంబరాలు గురువారం నాటితో ముగియటమే కాదు.. అదే రోజు కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే సందర్భంగా గోదావరి పుష్కరాలు ప్రారంభమైతే.. కన్యారాశి ప్రవేశంతో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను దాటి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తే.. మహారాష్టల్రోని నాసికా త్రయంబకం వద్ద అవతరించిన గోదావరి.. గాంభీర్యాన్ని, పెద్దతనాన్ని సంతరించుకుని సప్తర్షుల పేరుతో ఏడు పాయలుగా సాగర సంగమం చేస్తోంది. కులుకుల కృష్ణమ్మ చిలిపిదనానికి, వయ్యారానికి ప్రతీక... పౌరాణికంగా రెండు నదులకు విశేష గాథలు ప్రాచుర్యంలోనున్నాయి. ఇక కృష్ణా నదిని స్మరిస్తే చాలు పాపాలు హరిస్తాయంటారు.
రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు