ఆంధ్రప్రదేశ్‌

పార్టీ మారే ప్రసక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: టీడీపీ ఘోర పరాజయం అనంతరం తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం జరిగిన నియోజకవర్గ ముఖ్యుల సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తనపై రూమర్లు సహజమని, అందులో భాగంగానే తాను కొంతమంది ఎమ్మెల్యేలతో కేంప్ నిర్వహించి, అట్నుంచి అటే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. తాను సొంత పనిపై శ్రీలంక వెళ్లానని, ఎమ్మెల్యేలు ఎవరూ తన వెంట రాలేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని ఉద్ఘాటించారు. ఉండవల్లి ప్రజావేదికలో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజావేదిక భవనం అక్రమ కట్టడంగాను, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిన భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించడంపై గంటా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి తన అవసరాల కోసం ప్రజావేదిక భవనాన్ని కోరడంతో కేటాయించడం ఇష్టం లేకే అక్రమ కట్టడం పేరిట కూల్చివేస్తున్నారని ఆరోపించారు.
ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. సమావేశాల నిర్వహణకు ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రజావేదిక విషయంలో చిన్నచిన్న లోటుపాట్లను ఎత్తిచూపి, అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేయాలన్న నిర్ణయం సరికాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో నిర్మాణాలు జరిగాయని, ముందుగా వాటిని కూల్చివేసి, తరువాతే ప్రజావేదికను కూల్చివేయాలన్నారు. అంతేకాని ప్రజాధనంతో నిర్మించుకున్న భవనాన్ని కూల్చి వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఇతర ప్రజోపయోగ అవసరాల కోసం వినియోగించుకోవాలని హితవు పలికారు.