ఆంధ్రప్రదేశ్‌

దుర్గాఘాట్‌లో పుణ్యస్నానం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ఏ సమయంలో స్నానమాచరించినా పుణ్యం సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో చేపట్టిన సంకల్ప బలమే నేడు రాష్ట్ర వ్యాప్తంగా జలసిరికి కారణమన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్భంలో ఎటువంటి వదంతులు వచ్చినా ప్రజలు నమ్మవద్దని అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల వివరాలు ఘాట్ల వివరాలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ పుష్కరాల్లో కృష్ణా, గోదావరి నదులను పెన్నాకి అనుసంధానం చేసి సోమశిలకు నీళ్లు తీసుకువచ్చే విధంగా సంకల్పం చేయనున్నట్లు తెలిపారు. పుష్కరాల్లో భాగంగా పవిత్ర సంగమం వద్ద సాయంత్రం 7 గంటలకు హారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తాను దుర్గా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక ఆడియో సిడితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కరదీపికను ఆవిష్కరించారు. అనంతరం దుర్గాఘాట్ పోలీసుల కంట్రోల్ రూంను ప్రారంభించారు.