ఆంధ్రప్రదేశ్‌

బోటు యాత్ర లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 10 : కృష్ణా పుష్కరాల సమయంలో సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటు యాత్ర ఏర్పాటు చేయాలన్న కలెక్టర్ విజయమోహన్ ప్రయత్నాలకు ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఉండటంతో భక్తుల భద్రత దృష్ట్యా బోటు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచించినట్లు తెలుస్తోంది. జలాశయంలోకి ఎగువ నుంచి నీరు రావడంతో పాటు దిగువకు నీరు వెళ్తుండటంతో సంగమేశ్వరం, శ్రీశైలం మధ్య కృష్ణా నదిలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని సాగునీటి అధికారులు పేర్కొంటున్నారు. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వెళ్లే సమయంలో పెద్ద ఇబ్బందులు ఎదురుకాకపోయినా శ్రీశైలం నుంచి సంగమేశ్వరం వచ్చే సమయంలో వరద ఉద్ధృతిని ఎదుర్కొని బోటు ప్రయాణానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. దీంతో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు బోటు యాత్రపై అభ్యంతరం చెప్పినట్లు వెల్లడవుతోంది. సంగమేశ్వరం వద్ద పుష్కర స్నానం చేసి శ్రీశైలం వెళ్లేందుకు అలాగే శ్రీశైలంలో స్వామి వారి దర్శనం తర్వాత పాతాళగంగ చేరుకుని సంగమేశ్వరం వరకూ బోటులో వచ్చేందుకు భక్తులకు అవకాశం కల్పించాలని కలెక్టర్ భావించారు.

మరో మూడు రోజులు ఎండలే!

విశాఖపట్నం, ఆగస్టు 10: నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో బలహీనంగా ఉండటంతో కోస్తా అంతటా సాధారణం కన్నా ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బుధవారం దక్షిణ కోస్తాలో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఉత్తర కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. బుధవారం బాపట్లల 39 డిగ్రీలు, మచిలీపట్నం, నెల్లూరులో 38, గన్నవరంలో 37 డిగ్రీలు నమోదైంది. ఇదే పరిస్థితి మరో 2, 3 రోజులు కొనసాగుతుందని తెలిపారు. కాగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల వర్షం కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురియవచ్చు.

జివిఎంసి ఎఇఇ ఇంట్లో ఎసిబి సోదాలు

విశాఖపట్నం, ఆగస్టు 10: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఎఇఇ)గా విధులు నిర్వహిస్తున్న వీర మాధవరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) బుధవారం ఉదయం దాడులు నిర్వహించింది. మాధవరావు, అతని కుటుంబీకుల ఇళ్లలో ఎకకాలంలో నిర్వహించిన దాడుల్లో రూ.2 కోట్ల మేర ఆస్తులు గుర్తించారు. జివిఎంసిలో ఏఇ స్థాయి నుంచి విధులు నిర్వహిస్తున్న మాధవరావుపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఫిర్యాదులపై దృష్టి సారించిన ఎసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది మాధవరావు ఇంటితో పాటు కుటుంబీకులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దసపల్లా హిల్స్‌లోని సాయి మహరాజ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మాధవరావు ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డాబాగార్డెన్స్‌లో మూడు ఫ్లాట్‌లు, జి ప్లస్ 3 ఇల్లు, భీమునిపట్నంలో 300 చదరపు గజాల నివాస స్థలం, పెందుర్తిలో ఒక ఫ్లాట్, ఎండాడలో మరో ఫ్లాట్, కెనరాబ్యాంక లాకర్ తాళాలను స్వాధీనం చేసుకున్నారు. మాధవరావు కుమార్తె అత్తగారి పేరిట ఉన్న లాకర్‌లో మరో 39 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.2 కోట్లు వరకూ ఉంటుందని ఎసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ విలేఖరులకు తెలిపారు.

హోదా కోసం త్వరలో ఢిల్లీలో సిపిఐ ఆందోళన

ఒంగోలు, ఆగస్టు 10: దేశంలో ఇటీవల కాలంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, ఇందుకు నిరసనగా ఈనెల 17న సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. బుధవారం ఒంగోలులో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలు, దళితుల పై దాడులు జరగటం బాదాకరం అన్నారు. బిజెపి, మనువాదులు చేస్తున్న ఆరాచకాలను ప్రశ్నించిన దళితులపై ఇలాంటి దాడులు జరగటం సహాజంగా మారాయని అన్నారు. ఇదిలా ఉండగా ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కలసివచ్చే పార్టీలు, ప్రజలతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద త్వరలో ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా సిద్దవౌవుతున్నట్లు నారాయణ ఇదిలా ఉండగా పోలీసులు పావుగా వాడుకున్న మాజీ మావోయిస్టు నరుూం మారణకాండ పై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి: గాలి

నెల్లూరు, ఆగస్టు10: రాష్ట్ర విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని శాసనమండలి అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన సమయంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై అప్పటి యు పి ఏ ప్రభుత్వాన్ని నిలదీసిన అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రధాని మోడీకి పరిస్థితి వివరించి ప్రత్యేక హోదా ప్రకటించేలా చూడాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించి ఈశాన్య రాష్ట్రాలకు అందిస్తున్న విధంగానే ఆంధ్రప్రదేశ్‌కు సహాయాన్ని అందించాలని కోరారు. 11 పార్టీల మద్దతుతో కాంగ్రెస్ సభ్యుడు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఆర్థిక బిల్లంటూ లోక్‌సభకు పంపడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆర్థిక లోటు 2022 వరకు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. విభజన సమయంలో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు రూ.5లక్షల కోట్లడిగితే అందరూ ఎగతాళి చేశారని, ఇప్పుడు వాస్తవ పరిస్థితి అందరికి అర్థం అవుతోందన్నారు.