ఆంధ్రప్రదేశ్‌

జాతీయ స్ఫూర్తి పతాక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 13: మరికొన్ని గంటల్లో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారతావని సమాయత్తమవుతోంది. వీధివీధినా వాడవాడలా త్రివర్ణ పతాకాల రెపరెపలతో దేశభక్తి పరవళ్ళు తొక్కుతోంది. ఇటు స్వేచ్ఛా నిరతిని, అటు జాతీయ స్ఫూర్తిని చాటుకుంటూ వందల-వేల అడుగుల పొడవైన జెండాలతో జనం పరవశిస్తున్నారు. అలాంటి ఓ అద్భుత దృశ్యం అనంతపురంలో ఆవిష్కృతమైంది. 2800 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని శనివారం ప్రదర్శించి అనంతవాసులు తమ దేశభక్తిని చాటుకున్నారు. డిప్యూటీ సిఎం కెఇ.కృష్ణమూర్తి ఉదయం 10.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీని ప్రారంభించారు. 4వేల మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ భారీ జాతీయ పతాకాన్ని చేతబట్టుకుని తిరిగారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద ప్రారంభమైన ర్యాలీ క్లాక్‌టవర్, సుభాష్‌రోడ్డు, సప్తగిరి సర్కిల్, రాజురోడ్డు, శ్రీకంఠం సర్కిల్, రైల్వేఫీడర్ రోడ్డు మీదుగా తిరిగి ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు లేదా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించేందుకు పంపుతున్నట్లు కలెక్టర్ శశిధర్ పేర్కొన్నారు.