ఆంధ్రప్రదేశ్‌

బీసీల కష్టాలను తీర్చడమే కమిషన్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 9: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమాజంలో పేదలుగా ఉన్న బీసీలకు న్యాయం చేయడం, వారి కష్టాలను తీర్చడమే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ లక్ష్యం అని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ భగవన్‌లాల్ సహ్ని అన్నారు. జాతీయ బీసీ కమిషన్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం తిరుపతి శ్రీపద్మావతి అతిథిగృహంలో టీటీడీ, జిల్లా ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై బీసీల రూల్ ఆఫ్ రిజర్వేషన్, సంక్షేమ పథకాలు అమలును సమీక్షించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వివరిస్తూ గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిధిలోనే బీసీ జాతీయ కమిషన్ అనుసంధానమై ఉండేదని, ఇప్పుడు ప్రత్యేకించి కేంద్రం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో మొదటి సమావేశం నిర్వహించామని రెండవ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేశామన్నారు. బీసీల నుండి, సంఘాల నుండి ఫిర్యాదులు స్వీకరించామన్నారు. వీటిలో ప్రధానంగా శాఖలో 27శాతం అమలు చేయడం లేదని, నిరుద్యోగం పెరుగుతోందని, ఇతర రాష్ట్రాల్లో బీసీలను తెలుగు రాష్ట్రాల్లో బీసీలుగా గుర్తించడం లేదని, బీసీల్లో ప్రస్తుతం ఉన్న గ్రూపులు మార్చాలని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలనలోనికి తీసుకుని సమాజంలో పేదలుగా ఉన్న బీసీల అభ్యున్నతికి కమిషన్ ప్రణాళికలు రచిస్తామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జే ఈ ఓ బసంత్‌కుమార్, టీటీడీలో అమలు చేస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధార్మిక కార్యక్రమాలు వివరించారు. ధార్మిక సంస్థ అయినందున అర్చకులకు, నారుూబ్రాహ్మణులకు సంబంధించిన పోస్టుల్లో ప్రత్యేకంగా వారినే నియమిస్తున్నామన్నారు. టీటీడీ అనుబంధ విద్యాలయాల్లో ఎంతమంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారో వాటి భర్తీ నిబంధనలను కమిషన్‌కు వివరించారు.
కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆచారి తల్లోజ వేదిక్‌యూనివర్శిటీ, శిల్ప కళాశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా పలు బిసి సంఘాలు కమిషన్‌కు తమ సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. ఈ సమీక్షలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ లోకేష్‌కుమార్ ప్రజాపతి, సభ్యులు డాక్టర్ ఆచారి తల్లోజు, డాక్టర్ సుధాయాదవ్, డాక్టర్ కౌశలేంద్ర సింగ్ పటేల్, టీటీడీ సీ వి అండ్ ఎస్ ఓ గోపీనాథ్‌జెట్టి, టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, బిసీ వెల్ఫేర్ డి డి శ్రీ్ధర్‌రెడ్డి, ఈడి మురళీధరమూర్తి, డి ఈ ఓ పాండురంగస్వామి, హార్టికల్చర్ డిడి సరస్వతి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ వేణు, మెప్మా పీడీ జ్యోతి, పి ఆర్ ఎస్ ఈ అమర్‌నాథ్‌రెడ్డి, డ్వామా ఏపీడీ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.