ఆంధ్రప్రదేశ్‌

జగన్ పొలిటికల్ టెర్రరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 9: ‘రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి 40 రోజులైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేయడం మానేసి పొలిటికల్ టెర్రరిజం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేయడం గానీ, చంపడం గానీ చేస్తే సహించేది లేదు’ అని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో హత్యకు గురైన మల్లె రాజు కుటుంబాన్ని మంగళవారం రాత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో హత్యోదంతం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజు భార్య వరలక్ష్మి, 4వ తరగతి చదువుతున్న వినయ్, ఆనంద్, అవంతిని ఓదార్చారు. ఆ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బాబు ప్రసంగిస్తూ కొత్తప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రస్తుత ప్రభుత్వంతో పోరాటం చేయడానికి మీరంతా సంసిద్దంగా వుండాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మవరం ఎమ్మెల్యే కూడా పొలిటికల్ వయెలెన్స్ (రాజకీయ హింస)ను ప్రేరేపిస్తున్నారు.
పత్యాపురంలో హత్యకు గురైన మల్లెరాజు కుటుంబాన్ని ఎమ్మెల్యే బెదిరించారన్నారు. తాము పత్యాపురం గ్రామానికి వెళ్లేలోపు బాధిత కుటుంబాన్ని బెదిరించి ఇక్కడ ఏమీ జరగలేదన్నట్లు చెప్పాలని వత్తిడి తెచ్చారన్నారు. ఇలాంటి చర్యలను వైఎస్‌ఆర్ పార్టీ మానుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఏం జరిగినా సహించేది లేదన్నారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండగా ఎలాంటి హత్యారాజకీయాలకు పాల్పడలేదన్నారు.
అంతకు మునుపు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికి ఎలాంటి హత్యారాజకీయాలు ఎప్పుడూ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే రాష్ట్రంలో వంద మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. అంతటితో ఆగక చీనీచెట్లు నరకడం, కొంతమందిని కావాలనే జైలులో పెట్టడం చేశారని విమర్శించారు. అలాంటి చర్యలను మానుకోవాలన్నారు. ఖబర్దార్ పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఐదేళ్లు వుండి పార్టీ కార్యకర్తలకు అండగా వుండాల్సింది పోయి భయపడి పారిపోవడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ చర్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కూడా తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడే పరిస్థితులు కల్పించారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఉద్దేశించి అన్నారు.

చిత్రం...అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం పత్యాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు