ఆంధ్రప్రదేశ్‌

రుణ మాఫీ రహస్యమిదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: పంట రుణాలపై వడ్డీ ఎంతనేది ప్రభుత్వాలకు తెలియాల్సి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇందులో ఉంటుందని చెప్తూ 2018-19 సంవత్సరానికి రూ. 76,721 కోట్ల మేర పంట రుణాలు ఉన్నాయని దీనిపై రాష్ట్ర ప్రభుత్వమిచ్చే 4 శాతం అంటే రూ. 3068 కోట్లు సున్నా వడ్డీ అవుతుందని తెలిపారు. ఇది రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. దీన్ని రద్దు చేయటం వల్ల ఒకే లెక్కలు రికార్డులలో ఉంటాయని రూ. 76,721 కోట్ల మీద సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ. 3068 కోట్లు అంటే ఐదేళ్లలో రూ 15 వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసి దాన్ని రుణమాఫీగా చిత్రీకరించిందని టీడీపీ అధినేత చంద్రబాబు రుణమాఫీ పేరుతో అసత్యాలు ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. అనంతరం సున్నా వడ్డీపై వైసీపీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడారు. ఈ లోపు మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జీరో వడ్డీపై వివరాలు తీసుకుని సభలో అడుగు పెట్టారు. సమయం సాయంత్రం 4.30 గంటలు కావటంతో స్పీకర్ తమ్మినేని సభను శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు.