ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ జగన్ చేతుల మీదుగానే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: సాగునీటి ప్రాజెక్టుల పేరిట ఐదేళ్లలో టీడీపీ పాలకులు ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారో మరో నెలరోజుల్లో బయటపెడతాం.. తొందపడొద్దంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్‌కుమార్ యాదవ్ శాసనసభలో స్పష్టం చేశారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యులు డాక్టర్ నిమ్మల రామనాయుడు, అనగాని సత్యప్రసాద్, డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, మద్దాళి గిరిధరరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తిగా నిలుపుదల చేయలేదంటూనే దాదాపు 248 పనులకు సంబంధించి టెండర్ల దశలోనే కోట్లాది రూపాయల మేర అవినీతి జరిగిందనటానికి ఆధారాలు ఉండబట్టే విచారణకు ఆదేశాలు జారీ చేసి సంబంధిత పనులను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. 15 ఏళ్ల క్రితమే దివంగత వైఎస్ జల యజ్ఞం పేరిట ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులన్నీ తనయుడు జగన్ హయాంలోనే పూర్తయి ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తామన్నారు. టీడీపీ హయాంలో ఇతరులెవరూ బిడ్‌కు రాకుండా అత్యధిక పనులను తమ వారికే, అదీ అదనపు రేట్లపై కట్టబెట్టారని అన్నారు. అవసరమైతే ఆ టెండర్లను రద్దు పరిచి ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తామన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ గోదావరి జలాలను తరలింప చేస్తామన్నారు. ఇక పోలవరానికి అన్ని రకాల అనుమతులు వైఎస్ హయాంలోనే వచ్చాయని, పైగా కాలువలన్నీ పూర్తి కాగా చంద్రబాబు రెండు మోటర్లతో నీటిని తోడి రూ. 400 కోట్లు దొబ్బేసారన్నారు. దీనిపై దొబ్బేయటం ఏమిటంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు.
చిత్రం... సభలో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్ యాదవ్