ఆంధ్రప్రదేశ్‌

‘స్థానిక’ విజయంపై టీడీపీ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 13 : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతిపక్ష టీడీపీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ విజయం సాధించడం సహజమన్న కారణంతో ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల పట్ల అంతగా ఆసక్తి కనబరచవు. అయితే ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో తమ విజయం ఖాయమన్న ధీమాతో ప్రతిపక్ష పార్టీ(టీడీపీ) నేతలు ఉన్నారు. ఇందుకు కారణం ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు జనం వేసినవి కావన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలలో జరిగిన మోసాలతో వైసీపీ విజయం సాధించిందని, ఆ విషయం బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువు కానుందని వారు విశ్వాసంతో ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీ సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రాగా లోక్‌సభలో బలమైన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా నిలిచింది.
ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించినట్లే జరిగిందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైసీపీకి శాసనసభలో భారీ సంఖ్యలో స్థానాలు దక్కడంతో తమ అనుమానాలకు మరింత బలం చేకూరిందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టులను ఆశ్రయించడం సాధ్యం కాలేదని టీడీపీకి చెందిన కీలక నేత ఒకరు తెలిపారు. ఎన్నికల అనంతరం పార్టీ సమీక్షలో కూడా సరైన ఆధారాలు లేకుండా కోర్టుకెళ్లినా ప్రయోజనం ఉండదని అధినేత పేర్కొన్నట్లు తెలిపారు. తమ అంచనా ప్రకారం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి బలంగా ఉందని, అయితే కేంద్రంతో కుమ్మక్కై జగన్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈవీఎంల మాయాజాలంతో విజయం సాధించిన వైసీపీకి స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌తో జరిగే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయన ధీమాతో ఉన్నారు. స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌తో నిర్వహిస్తే ప్రజాభిప్రాయం స్పష్టంగా తెలుస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 90శాతానికి పైగా విజయం సాధిస్తేనే ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం ఉన్నట్లని వారంటున్నారు. అయితే అది సాధ్యం కాదని ఇప్పటికీ ప్రజాభిప్రాయం తమ వైపే ఉందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై ఉన్న అనుమాలకు తెరదించడం ఖాయమని వారంటున్నారు. స్థానిక ఎన్నికలను కూడా బ్యాలెట్ పేపర్‌తో కాకుండా ఈవీఎంలతో నిర్వహించడానికి మళ్లీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తారన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికారులు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపారని అయితే ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ ఇప్పట్లో ముందుకు రాకపోవచ్చని వారు అనుమానిస్తున్నారు. టీడీపీ నేతలు విశ్వసిస్తున్నట్లు బ్యాలెట్ పోరులో టీడీపీకి అనుకూలంగా ప్రజలు ఉన్నట్లు స్పష్టమైతే ఈవీఎంలపై ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందని విశే్లషకులు అంటున్నారు. బ్యాలెట్ పోరులో కూడా టీడీపీ ఓడితే ఈవీఎంలపై ప్రజల్లో జరుగుతున్న చర్చకు తెరపడతుందని స్పష్టం చేస్తున్నారు.