ఆంధ్రప్రదేశ్‌

కుటుంబం ఆత్మహత్య ఆర్థిక సమస్యలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 14 : కన్నకొడుకు, కూతురితో సహా దంపతులు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సంచలనం సృష్టించింది. నంద్యాలలోని బర్మశాల ప్రాంతానికి చెందిన రాంప్రసాద్(38), భార్య సత్యవాణి(34), కూతురు శోభారాణి(14), కుమారుడు విజయకుమార్(12) నలుగురూ కలిసి ఆదివారం తెల్లవారుజామున ప్రథమనంది దేవస్థానం వద్ద చెట్ల చాటున పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారంగా మారడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు.

నరుూంను పెంచి
పోషించింది బాబే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్ అరాచకాలను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను చంపించేందుకు నరుూమ్‌ను ఆ రోజుల్లో చంద్రబాబు వాడుకున్నారన్నారు. ప్రజా ఆందోళనలు, నిరసనలు అణగతొక్కేందుకు చంద్రబాబు నరుూమ్‌ను అన్ని రకాలుగా ఉపయోగించుకుని వదిలేశాడన్నారు. నరుూమ్ అనే వేయి తలల విషనాగును పుట్టించింది పెంచి పోషించింది చంద్రబాబేనని అన్నారు. పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్‌ను విమర్శించడం చూస్తుంటే బాబు మానసిక స్ధితి బాగా లేదనిపిస్తుందన్నారు. జగన్‌ను తిట్టేబదులు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆ శక్తిని వినియోగించాలన్నారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీరామారావును పదవీచ్యుతుడ్ని చేసిన చంద్రబాబు ఎన్టీరామారావుకు పిండ ప్రదానం చేసినా ఉపయోగం ఉండదన్నారు. పుష్కరాలు పవిత్ర కార్యక్రమమని, వీటిని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.