ఆంధ్రప్రదేశ్‌

విద్యా రంగానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూ లై 14: రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే బడ్జెట్‌లో 14 శాతం నిధులు కేటాయించి ప్రాధాన్యత ఇచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు విచ్చేసిన ఆయన అపుస్మా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌కుమార్ మాట్లాడుతూ నవరత్నాల్లో ప్రధానంగా విద్య, వైద్యం, రైతు సంక్షేమానికి తొలి బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. అమ్మ ఒడి పథకం ద్వారా జనవరి నాటికి విద్యార్థుల తల్లులకు 15 వేల రూపాయలను ప్రభుత్వం నేరుగా అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టేందుకు, ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం విద్యాభివృద్ధికి నామమాత్రపు నిధులు కేటాయిస్తే తాము అధికంగా నిధులు కేటాయిస్తూ అన్నివర్గాలకు విద్యను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.