ఆంధ్రప్రదేశ్‌

వచ్చే అసెంబ్లీ అమరావతిలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: రానున్న శాసనసభ సమావేశాలను అమరావతిలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో సోమవారం ఆయన పతాకావిష్కరణ చేసిన అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరిగేలా చూస్తానని, ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. వెలగపూడిలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణంపై కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. కాగా, అమెరికాలో తన 20 రోజుల పర్యటన విజయవంతమయిందని కోడెల చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, డిజిటల్ క్లాస్ రూములు, మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రవాసాంధ్రుల స్పందన బాగుందని, ఇందుకోసం దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వారి నుంచి హామీలు వచ్చాయని తెలిపారు. వారి పెట్టుబడులు, వితరణకు తగిన నమ్మకం కలిగితే ప్రవాసాంధ్రులు ముందుకువస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ప్రవాసాంధ్రుల్లో ఉన్న నమ్మకమే పెట్టుబడులకు కారణమన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రవాసాంధ్రులు గుర్తించారని, అందుకే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నారన్నాని చెప్పారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం పెరగడం ఆనందంగా ఉందని, ఇది తన గొప్పతనం కాదని, రాష్ట్రంతో పాటు సొంత ప్రాంతం పట్ల ప్రవాసాంధ్రులకు ఉన్న ప్రేమాభిమానాలే కారణమని తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని వారు తపిస్తున్నారని, వీరి సహకారాన్ని నవ్యాంధ్ర నిర్మాణానికి వినియోగించుకుంటామన్నారు.