ఆంధ్రప్రదేశ్‌

హిందూ మతంలో కొరవడుతున్న సమానత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 15: ప్రస్తుతం హిందూ మతంలో సమానత్వం, సోదర భావం కొరవడుతూ విభజన వాదం కొనసాగుతోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జే శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో తులనాత్మక దృష్టికోణంలో నేటి భారతదేశం అనే అంశంపై విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతీయ విధానంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్లిష్టంగా ఉందని, వలసవాదం పెరిగిపోయి భారతదేశ పరిణామక్రమాన్ని మరింత లోతుకి వెళ్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో హిందుత్వ ప్రాజెక్టులకు ప్రధాన అవరోధాలుగా కులాల పునాది, దాని అంతర్గత విభజనలు క్రమంగా హిందూ మతాన్ని సమస్యాత్మకం చేస్తోందని, ఇది జాతీయ వాదమని అన్నారు. బెంగాల్, ఒడిశా, తమిళనాడు వంటి బలమైన భాషా జాతీయ ఉద్యమాల చరిత్ర చూసిన ప్రాంతాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విభిన్న మతాలు, సంస్కృతులు కలిగిన మన దేశంలోని మేథావులు, ప్రజాస్వామ్య వాదులు సమగ్ర అవగాహనతో ప్రతిఘటించే శక్తిని అలవరచుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ బీ కూర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ప్రతినిధి కేవీ సుబ్బరాజు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, చలసాని రాఘవేంద్రరావు, డీ లలిత, వెంకటరావు తదితరులు ప్రసంగించారు.