ఆంధ్రప్రదేశ్‌

స్వాతంత్య్రం వచ్చిందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: ‘దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే నిజంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందా? అనే అనుమానం కలుగుతోంది..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు కావస్తున్నా ఇంకా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్య్రం ఉన్నట్లు కనిపించడం లేదని అన్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై జరిగిన దాడి అమానుషమని ఆయన విమర్శించారు. మరణించిన ఒక ఆవు చర్మాన్ని ఒలుస్తున్న కొందరిపై దాడి చేసి నడి రోడ్డుపై కట్టేసి చెప్పులతో కొట్టడం దుర్మార్గమని అన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని ఆయన విమర్శించారు. ఈ సంఘటనతో నిజంగా మనకు స్వాతంత్య్రం లభించిందా? లేదా? అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. ఇక రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పెడ చెవిన పెడుతున్నాయని ఆయన విమర్శించారు.

చిత్రం.. వైకాపా కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిష్కరిస్తున్న జగన్