ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఆగస్టు 15: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను గడచిన మూడు రోజుల్లో దాదాపు 5 లక్షల మంది యాత్రికులు దర్శించుకొని తరించారు. కేవలం ఆది, సోమవారాల్లో 3 లక్షల మంది యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నారు. వారాంతరపు సెలవులు రావటంతో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట నుండి ఆదివారం రాత్రి 11 గంటల సమయానికి 2 లక్షలమంది, సోమవారం వేకువజాము నుండి సోమవారం రాత్రి 11 గంటల వరకు లక్ష మంది, ఈ విధంగా రెండు రోజులకు కలిసి మూడు లక్షల మంది పుష్కర యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు వివరించారు. ఈ మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులకు సుమారు 22 గంటలపాటు సమయానికి కేటాయించటంతోపాటు అన్ని దర్శనాలు బంద్ చేసి అందరికీ ముఖమంటప దర్శనం వరకే అనుమతించటంతో భక్తులు అధిక మొత్తంలో అమ్మవారిని దర్శించుకునే వీలు కలిగింది. కృష్ణా పుష్కరాల 4వ రోజైన సోమవారం అన్ని క్యూ లైన్లలో వేకువ జామునుండే భక్తులు బారులుతీరారు. ఆదివారం అర్థరాత్రి ప్రారంభమైన భక్తుల రద్దీ సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. తర్వాత తిరిగి సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన రాత్రి 11గంటల వరకు కొనసాగింది.
ఘాట్ల వద్ద రద్దీ
కృష్ణా పుష్కరాలు సందర్భంగా పవిత్ర స్నానాలకు ఒక్క విజయవాడ నగరానికే మూడుకోట్ల మంది పైగా యాత్రికులు తరలి రాగలరనే ప్రచారంతో 12 రోజుల పాటు ఆ తాకిడిని ఈ నగరం తట్టుకోగలదా అని నగరవాసులంతా తల్లడిల్లిపోయారు. దీనికి తగ్గట్లే నగరంలోని అన్ని ముఖ్య కూడలి ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటయ్యాయి. తీరా చూస్తే పుష్కర ఘాట్లు వెంబడి వారధి, ప్రకాశం బ్యారేజి, భవానీద్వీపం వరకు ఘాట్ల వెంబడి గల హైదరాబాద్ జాతీయ రహదారి మినహా బందరు, ఏలూరు రోడ్లతో సహా నగరంలో ఏ రహదారిపై కూడా పుష్కర సందడి కన్పించకపోవటంతో నగరవాసులు హమ్మయ్యా అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు. భారీగా ప్రైవేట్ వాహనాలు తరలి రాగలవనే దృష్టితో పాలీ క్లినిక్ రోడ్‌లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, జాతీయ రహదారి వెంబడి లయోలా కళాశాల, గుణదల మాత పుణ్యక్షేత్రం ఇలా నగరంలో అనేకచోట్ల ఏర్పాటుచేయబడిన పార్కింగ్ ప్రదేశాలు కూడా వాహనాల రాకపోకలు లేక వెలవెలపోతున్నాయి. నిత్యం లక్షల మంది యాత్రికులు పుష్కర స్నానాలకు వస్తున్నప్పటికీ ఆ సందడి మాత్రం కన్పించడం లేదు. కనీసం ప్రతి ఏటా దసరా ఉత్సవాలకు 10 రోజులు, భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఐదు రోజుల పాటు కన్పించే సందడి ఆమేర జరిగే వ్యాపారాలు కూడా నగరంలో ప్రస్తుతం కన్పించడం లేదు. పుష్కరాల సందర్భంగా భారీఎత్తున వ్యాపారాలు జరుగుతాయని ప్రధాన రహదారుల్లోని వివిధ షోరూంల యజమానులందరూ ఆశించారు. ఆమేర లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి తమ తమ వ్యాపార సంస్థలను రంగు రంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. తీరా ఆశించిన మేర వ్యాపారాలు లేక డీలాపడుతున్నారు. నిత్యం లక్షల మంది పుష్కర యాత్రికులు తరలి వస్తున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతున్నదనే దానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో తరలివచ్చేవారిలో ఏ ఒక్కరూ కూడా కాలు కింద పెట్టకుండా నేరుగా స్నాన ఘట్టానికి వెళ్లి స్నానమాచరించి తిరిగి గమ్యస్థానాలకు చేరేలా ప్రతి రెండు నిమిషాలకు ఉచిత సిటీ బస్సు అందుబాటులో వుండటమే ప్రధాన కారణం. దీంతో ఘాట్లపై రద్దీలేని ప్రాంతాల్లో కేవలం 15 నిమిషాల్లోనే స్నానాలు చేసి వెంటనే సిటీ బస్సుల్లో తాము దిగిన శాటిలైట్ బస్ స్టేషన్‌లకు కేవలం అరగంటలో చేరుకుని సిద్ధంగానున్న బస్సులలో తిరుగుముఖం పడుతున్నారు. ఈ శాటిలైట్ బస్‌స్టేషన్ల వద్ద నిరంతరం ఎప్పుడు చూసినా కనీసం 30 పైగా ఉచిత సిటీ బస్సులు సిద్ధంగా వుండటంతో ప్రయాణికులు సీటు కోసం ప్రయాసపడే అవసరం కూడా లేకుండా పోతున్నది. ఇదిలా వుంటే జిల్లాలో 36 పుష్కరనగర్‌లుంటే ఒక్క విజయవాడ నగరంలోనే 20 ఉన్నాయి. నిత్యం 700 పైగా ఉచిత సిటీ బస్సులు అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌ను చుట్టిముట్టి వెళుతున్నాయి. తాజాగా విశాఖ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి సాధారణంగా వచ్చే బస్‌లు కూడా నేరుగా ఈ బస్ స్టేషన్‌కే చేరుతున్నాయి. దీంతో ఏ ఒక్కరికీ అసౌకర్యం కలుగటం లేదు.

చిత్రం.. విజయవాడ కృష్ణవేణి ఘాట్‌లో కోలాహలం