ఆంధ్రప్రదేశ్‌

ప్రజల సంతృప్తే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: కృష్ణా పుష్కరాలు సందర్భంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, కల్పిస్తున్న వసతులు తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుండి 90 శాతానికి పైగా సానుకూల స్పందన వచ్చే విధంగా అధికార యంత్రాంగమంతా సక్రమంగా పనిచేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని మెరుగైన సేవలందించేందుకు అన్ని విధాలా కృషిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోలు కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన సమీక్షలో సిఎం మాట్లాడుతూ ఈ విధమైన స్పందన వచ్చేవరకూ తాను నిద్రపోనని ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నందున రానున్న రోజుల్లో దీన్ని ఒక మోడల్‌గా ఉపయోగించి ప్రభుత్వానికి సంబంధించి అన్ని సేవలకు దీన్ని రాష్టమ్రంతటా వినియోగించుకునే ఆలోచన చేస్తున్నామని కావున ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు కృషి చేయాలని చెప్పారు. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం భక్తుల రద్దీ కొంత తగ్గిందని అందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఒక కారణం కావచ్చని ఆయన పేర్కొన్నారు. గత మూడు రోజుల్లో పుష్కరాల ఏర్పాట్లపై ప్రజల నుండి 53 శాతం సానుకూల స్పందన వచ్చిందని అది సోమవారం 62 శాతానికి పెరిగిందని దీన్ని 80 నుండి 90 శాతానికి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని సిఎం స్పష్టం చేశారు. అంతవరకూ తీసుకువెళ్లేందుకు ప్రస్తుతం అందుతున్న సేవలను మరింత మెరుగైన రీతిలో అందించగలిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పారు. వివిధ ఫంక్షనరీల వారీగాను, సేవల పరంగాను, టీంల వారీగాను, సర్వీస్ ప్రొవైడర్ల వారీగాను ఒక సందేశాన్ని ప్రజలకు పంపించి వాటి ద్వారా ప్రజా స్పందనను తెల్సుకోవాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి సర్వేకు, ఐవిఆర్‌ఎస్ విధానంలో సేకరిస్తున్న స్పందనకు కొంత తేడా ఉంటోందని ఆ అంతరాన్ని సమం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. పుష్కరాలకు వచ్చిన భక్తులకు సకాలంలో భోజనం అందుతుందా, తాగునీరు, మజ్జిగ వంటి సేవలు ఏ విధంగా అందుతున్నాయి, ఉచిత ఆర్టీసీ బస్సులు సకాలంలో ఆయా రూట్లలో అందుబాటులో వున్నాయా, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజల స్పందనను నూరు శాతం తెల్సుకుని ఉంటే వెంటనే సరిచేసుకుని భక్తులందరికీ మెరుగైన సేవలు అందేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని అన్నారు. అంతేగాక ప్రతి విభాగం, ప్రతి సేవకు సంబంధించి ఒక జవాబుదారీతనం ఉండేలా సేవలు అందించాలని సిఎం అధికారులకు స్పష్టం చేశారు.

చిత్రం.. పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సోమవారం సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు