ఆంధ్రప్రదేశ్‌

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఆగస్టు 15: అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి(పిటిసి) మైదానంలో సోమవారం జరిగిన రాష్టస్థ్రాయి 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. రాష్టస్థ్రాయి వేడుకలు మొట్టమొదటిసారి నగరంలో నిర్వహించడంతో తిలకించేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. తొలుత జాతీయ పతాకావిష్కరణ గావించిన ముఖ్యమంత్రి అనంతరం ఓపెన్‌టాప్ జీపులో స్టేడియం చుట్టూ తిరిగి ప్రజలకు అభివాదం చేశారు. వివిధ బెటాలియన్లకు చెందిన ఎపిఎస్‌పి పోలీసులు, ఎన్‌సిసి బాలబాలికలు, స్పోర్ట్స్ స్కూల్ కడప, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు, ఎపి ఐర్ సర్వీసెస్ పోలీస్ బ్యాండ్‌కు అనుగుణంగా జరిగిన కవాతు అలరించింది. అనంతరం వివిధ ప్రభుత్వశాఖల ప్రగతిని సూచించే శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తం 16 శాఖల శకటాల్లో పౌరసంబంధాలశాఖ శకటం ప్రథమ బహుమతి, ఉద్యానశాఖ ద్వితీయ, పరిశ్రమలశాఖ శకటం తృతీయ బహుమతిని సాధించాయి. రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. దేశభక్తి గీతాలకు అనుగుణంగా చేసిన విన్యాసాలు, వ్యాయామాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

చిత్రం.. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు