ఆంధ్రప్రదేశ్‌

నా రాజీనామా ఆమోదించండి: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 22: పీసీసీ అధ్యక్ష పదవికి తన రాజీనామాను తక్షణమే అమోదించి రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఎన్ రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్ ఇన్‌చార్జి) కే వేణుగోపాల్‌ను కలిసిన రఘువీరా ఏపీలో అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకముందే మే 19న పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించానన్నారు. తన స్వగ్రామం నీకంఠాపురంలో దేవాలయ నిర్మాణ బాధ్యతలలో బిజీగా ఉన్నందున ఆరు నెలల పాటు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనలేనన్నారు.