ఆంధ్రప్రదేశ్‌

స్నానాలకు పుష్కలంగా నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: కృష్ణా పుష్కరాలు సందర్భంగా మిగిలిన మరో వారం రోజుల పాటు పుష్కర స్నానాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పులిచింతల నుంచి 12వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి పోలవరం కుడికాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజి వద్ద క్రమేణా నీటిమట్టం పెరుగుతున్నది. ఏడాది పొడవునా 12 అడుగుల నీటిమట్టంతో కళకళలాడుతూ కన్పించాల్సిన ప్రకాశం బ్యారేజి సరిగ్గా నెల రోజుల క్రితం నాలుగైదు అడుగులు కన్పిస్తూ పుష్కర స్నానాలెలాయని భయపడిన సందర్భాలున్నాయి. అలాంటిది ఇప్పుడు 11.2 అడుగులతో నీరు పరవళ్లు తొక్కుతున్నది. ఈ నేపధ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓవైపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించి వరి నారుమళ్లు ఎండకుండా తగు స్థాయిలో నీటిని సరఫరా చేయిస్తూ బ్యారేజి ఎగువ ఘాట్లలో పుష్కర స్నానాల కోసం పుష్కలంగా నీరు నిలిచేలా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి తూర్పుడెల్టా కాలువలకు 8వేల 372 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 6వేల 034 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్‌కు 110 క్యూసెక్కులు వెరశి 14వేల 450 క్యూసెక్కుల నీరు సరఫరా జరుగుతుంటే బ్యారేజి దిగువ సీతానగరం ఘాట్, ఇటు పద్మావతి, కృష్ణవేణి ఘాట్లలో స్నానాల కోసం ప్రత్యేకంగా తవ్వబడిన లీడింగ్ ఛానెల్స్‌లో నిరంతరం కనీసం నాలుగు అడుగుల లోతులో నీరు నిలిచేలా 150 క్యూసెక్కులు చొప్పున నీటిని వదలుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కృష్ణాడెల్టాలో 11.29 టిఎంసిల నీరు వినియోగం కాగా ఇందులో పట్టిసీమ నుంచి వచ్చిన గోదావరి నీరు ఏడు టిఎంసిలు వుంది. ఈ స్థానంలో శ్రీశైలం నుంచి కృష్ణాకు రావాల్సిన వాటా నుంచి 7 టిఎంసిల నీటిని హంద్రీ-నీవా ద్వారా అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్‌కు తరలించడంతో ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివెళ్లి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.
రాయలసీమకు 80 టిఎంసిలు
ప్రస్తుతం కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నీరు 1438 టిఎంసిలు నిలువ వుంటే అందులో గోదావరి తూర్పు, సెంట్రల్, పశ్చిమ డెల్టాలన్నింటికీ కల్సి వాడుకుంటున్నది కేవలం 51.45 టిఎంసిలు కాగా మిగిలిన 1386.49 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృధాగా పోయిన ఈ నీటితో 400 ప్రకాశం బ్యారేజీలను నింపవచ్చంటూ అందుకే ఈ నీటిని సద్వినియోగం కోసం ఎవరు ఎన్ని విమర్శించినా ఎంత అడ్డుపడినా పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరిని తరలించడం ప్రారంభించామన్నారు. మొత్తం 80 టిఎంసిలు వాడుకుంటే ఆ నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించడం ద్వారా ఆ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చివేయవచ్చన్నారు. ఏది ఏమైనా నదుల అనుసంధానాన్ని విమర్శించిన వారి నోళ్లు మూతబడ్డాయని మంత్రి ఉమా సగర్వంగా చెప్పారు. కృష్ణాతో పెన్నాను అనుసంధానం చేసి తీరుతామన్నారు. పంట సంజీవని కింద రూ.665 కోట్లతో 53వేల 545 నీటి కుంటలను అభివృద్ధి చేశామని ఇంకా 2 లక్షల 82వేల పనులు పురోగతిలో వున్నాయని, భూగర్భ జల మట్టాలు పెరుగడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు.