ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలానికి భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 16: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలానికి నీటిరాక తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం 875.10 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 163.9724 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి 24 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంటోంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్లను రన్ చేస్తూ విద్యుత్ ఉత్పత్తి అనంతరం 29,696 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు.