ఆంధ్రప్రదేశ్‌

భక్తులంతా పూర్తి సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో రోజు అర్థరాత్రి రెండు, మూడు గంటల వరకూ అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి వచ్చేది. కానీ కృష్ణ పుష్కరాల్లో తక్కువ కష్టంతో, యాత్రికుల్లో అధిక సంతృప్తిని తీసుకురాగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పుష్కరాల ఐదవ రోజు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, ఆహార పంపిణీ, సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణలో సాంకేతిక వినియోగం వలనే అద్భుత ఫలితాలు రాబట్టగలుగుతున్నామని సిఎం చెప్పారు. గోదావరి పుష్కరాలతో పోల్చితే కృష్ణ పుష్కరాల్లో ఏర్పాట్లు పగడ్బందీగా, సుళువుగా జరుగుతున్నాయని అన్నారు. అధికార యంత్రాంగం, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎటువంటి వత్తిడికి లోనుకాకుండా సునాయాసంగా తమకు నిర్దేశించిన విధులు బాధ్యతతో నిర్వర్తిచడాన్ని ఆయన అభినందించారు. తను మోటివేట్ చేస్తే, అల్లుకుపోతున్నారని అధికారులను ఆయన అభినందించారు. ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది పనితీరు వల్లే అన్ని ఘాట్‌లలో వృద్ధులు, వికలాంగులు ఎటువంటి ఇబ్బందిపడకుండా పుష్కర స్నానం చేయగలుగుతున్నారని చంద్రబాబు చెప్పారు. పుష్కర యాత్రికులకు బాగా సేవలందించిన వారికి శాఖాపరంగా గుర్తించి అవార్డులు అందిస్తామని ఆయన చెప్పారు. రాబోయే వారం రోజుల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు బాగుందని ప్రజలు ప్రసంసిస్తున్నారు. గత ఏడాది గోవదావరి పుష్కరాల్లో 20 శాతం మంది మాత్రమే పిండ ప్రదానంలో పాల్గొనగా, కృష్ణా పుష్కరాల్లో 30 వాతం మంది పిండ ప్రదానంలో పాల్గొంటున్నారనిన్నారు. ఈ నెల 18న శ్రావణి పౌర్ణమికి భారీగా భక్తులు తరలి వస్తారని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు.